మాజీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్, ఆయన అలాంటి కొడుకు, ఓటుతో!
కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తున్న సమయంలో ఆడపిల్లలను, మహిళలను కించపరిచేలా మాట్లాడిన కర్ణాటక మాజీ సీఎం, మండ్య లోక్ సభ నియోజక వర్గం బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామిపై బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి దారి తప్పిన కొడుకు అంటూ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీద ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు.
సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీద మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో దెయ్యం కొడుకు ఎవరో, దొంగ కొడుకు ఎవరో, దారి తప్పిన కొడుకు ఎవరో మండ్య ప్రజలు నిర్ణయిస్తారని, అంత వరకు వేచి చూడాలని నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని ఉద్దేశించి అన్నారు. మహిళల గురించి కించపరిచేలా మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి దొర కొడుకు, దారి తప్పిన కొడుకు అని విమర్శించారు.

దేశంలోని ఆడపిల్లలకు ఒక గౌరవం అంటూ ఏమీ లేదా అని ప్రకాష్ రాజ్ మాజీ సీఎం కుమారస్వామిని ప్రశ్నించారు. మహిళలను తేలికగా మాట్లాడటం సరికాదని, వారిని కించపరిచే ప్రకటనలు చెయ్యడం పద్దతిగా లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి మండ్య మహిళలు దగిన గుణపాఠం చెబుతారని ప్రకాష్ రాజ్ అన్నారు. మాజీ సీఎం కుమారస్వామి పూర్తిగా నడక తప్పిన కొడుకు అని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
గతంలో సుమలత మీద కూడా కుమారస్వామి ఇలాంటి ఆరోపణలే చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సుమలత అంబరీష్‌ను మొగుడు చచ్చిన ముండమోపి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం కుమారస్వామికి అప్పుడే మండ్య ప్రజలు చుక్కలు చూపించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఒక మాజీ సీఎం మహిళలను ఇలా చులకనగా మాట్లాడటం సిగ్గుచేటు అని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.
ఆ సందర్బంలో మండ్యలో సుమలత మీద పోటీ చేసిన కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామిని ఓడించిన మండ్య మహిళలు వారికి తగిన బుద్ది చెప్పారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఆ రోజు మండ్య లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోక పోయినా మాజీ సీఎం కుమారస్వామికి ఇంకా అర్థం కాలేదని, ఈ ఎన్నికల్లోనూ మహిళల గురించి తేలిగ్గా మాట్లాడిన ఆయనకు అదే మహిళలు తగిన బుద్ది చెబుతారని, ఆ రోజు దగ్గరల్లోనే ఉందని నటుడు ప్రకాష్ రాజ్ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications