ప్రధాని నరేంద్ర మోడీకి మతిభ్రమించింది, కన్నడిగనా, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి మతిభ్రమించిందని బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి తాను కన్నడిగ అంటారు, గుజరాత్ వెళ్లి తాను గుజరాతి అంటారు, ఆయన ఓ పెద్ద అపద్దాలకోరు అని ఈ ఒక్క విషయం చూస్తే అర్థం అవుతోందని ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళలోని బీసీ రోడ్డులో శనివారం ఏర్పాటు చేసిన స్వాభిమాని సమావేశానికి హాజరైన ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Recommended Video


కన్నడ నేర్పిస్తాం
ప్రధాని నరేంద్ర మోడీ తాను కన్నడిగ అని ట్వీట్ చెయ్యడంతో మోడీగారు మీకు కన్నడ నేర్పిస్తాం అంటూ ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేశారు. మోడీ గారు కన్నడ పాఠశాలల్లో మీరు కన్నడ నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వం, వృద్దుల శిక్షణా కేంద్రంలో మీరు కన్నడ నేర్చుకోవాలని ప్రకాష్ రాజ్ వ్యంగంగా అన్నారు.

2019లో నిరుద్యోగి
2019లో నరేంద్ర మోడీ నిరుద్యోగి అవుతారని ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీని ఇంటికి పంపిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజలను అమాయకులను చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ప్రకాష్ రాజ్ అన్నారు.

బీజేపీకి సిద్దాంతాలు లేవు
కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు సిద్దాంతాలు ఉన్నాయని, అలాంటి సిద్దాంతాలు బీజేపీకి లేవని ప్రకాష్ రాజ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలనే తమ సిద్దాంతాలుగా చెప్పుకుని బీజేపీ కాలం గడుపుతోందని ప్రకాష్ ఆరోపించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications