ట్విస్ట్: రాహుల్ గురించి ప్రత్యూషకు తెలిసిన అసలు నిజం, డేటింగ్ వద్దన్నా
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అంశంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. ప్రత్యూష తల్లిదండ్రుల వాదనలు విన్న అనంతరం ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.
రాహుల్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. రాహుల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడవచ్చునని చజెబుతున్నారు.
ప్రత్యూష తల్లిదండ్రులు రాహుల్ పైన సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ తన ఆస్తిపాస్తుల గురించి ప్రత్యూషతో అబద్ధాలు చెప్పాడని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని మోసగించాడని ప్రత్యూష తల్లి చెప్పారు. ప్రత్యూషను రాహుల్ కొట్టాడని ఆరోపించింది.

రాహుల్ గురించి ఈ మధ్యే ప్రత్యూషకు అసలు నిజం తెలిసిందని తండ్రి చెప్పాడు. రాహుల్‌కు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడని ప్రత్యూషకు తెలిసిందని చెప్పారు. తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి, తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష తండ్రి ఆరోపించారు.
తల్లిదండ్రులు మాట్లాడుతూ... రాహుల్ తన కూతురు ప్రత్యూషను బాగా వేధించాడని, అందుకు అతను అంతకంతకు శిక్ష అనుభవించాలని, బతికే ఉంటూ శిక్ష అనుభవించాలని చెబుతున్నారు.
రాహుల్ మంచివాడు కాదని, అతనితో డేటింగ్ వద్దని చెప్పినా ప్రత్యూష వినలేదని స్నేహితులు అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు.
ప్రత్యూష ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు!
ప్రత్యూష నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఒంటి పైన గాయాలు ఎందుకు ఉన్నాయని, ఆసుపత్రిలో చేర్పించాక ప్రియుడు ఎందుకు పారిపోయాడని ప్రశ్నిస్తున్నారు.
రాహుల్ కంటే ముందు ప్రత్యూషకు మకరంద్ మల్హోత్రా అనే ప్రియుడు ఉన్నాడు. అతడితో ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. తనను బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, తనను మోసం చేసిందని మకరంద్ ప్రతి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రాహుల్ రాజ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమకు దారి తీసింది. ప్రేమ వల్ల నిత్యం పోలీస్ స్టేషన్ గడప తొక్కవలసి వస్తుందని ప్రత్యూష అప్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications