Puneeth Rajkumar: ప్రాణాపాయ స్థితిలో పవర్ స్టార్: జూ.ఎన్టీఆర్‌కు ఆప్తుడు: పాట కూడా
బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో ఆయనకు గుండెపోటు సంభవించినట్లు చెబుతున్నారు. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు. గెలియా.. గెలియా.. అనే ఆ పాట సూపర్ హిట్. పునీత్ రాజ్‌కుమార్.. చందనసీమలో యంగ్ సూపర్ స్టార్. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌కు కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.

రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు. ఇక మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. పవర్ స్టార్‌గా పేరుంది. యూత్‌లో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన యువరత్న మూవీ తెలుగులోనూ విడుదలైంది. మంచి మూవీగా మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.
పునీత్ రాజ్ కుమార్ జిమ్‌లో కసరత్తు చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే వేలాది మంది పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన క్షేమంగా బయటికి రావాలంటూ పూజలు, ప్రార్థనలు చేస్తోన్నారు.
ఈ సమాచారం అందిన వెంటనే ఆయన అన్న శివరాజ్ కుమార్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, కేజీఎఫ్ ఫేమ్ యష్ ఆసుపత్రికి చేరుకున్నారు. శాండల్‌వుడ్ మొత్తం ప్రస్తుతం ఆసుపత్రి వద్దే నిలిచింది. ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారిపోయింది. పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. నటసార్వభౌమ, చక్రవ్యూహ, రణవిక్రమ, దొడ్మనె హుడుగ, పవర్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్ రాజ్‌కుమార్.












Click it and Unblock the Notifications