కాలా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వండి, కన్నడలోనే వేడుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ !
Recommended Video

బెంగళూరు: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే కర్ణాటకలో కాలా సినిమా విడుదల అడ్డంకులకు ఇంకా బ్రేక్ పడలేదు. కర్ణాటకలో గురువారం కాలా సినిమా విడుదల అవుతుందా, లేదా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం చిక్కడం లేదు.
కర్ణాటకలో కాలా సినిమా విడుదల అవుతున్న థియేటర్ల దగ్గర భద్రత కల్పించాలని కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాలా సినిమా పంపిణిదారులు, సినిమా విడుదల అవుతున్న థియేటర్ల యాజమాన్యం పోలీసులతో సంప్రధించాలని కర్ణాటక హైకోర్టు సూచించింది.

ఈ సందర్బంలో కాలా సినిమాను విడుదల చెయ్యడానికి కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి వ్యతిరేకిస్తోంది. ఈ సమయంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నడిగులకు మనవి చేశారు. బుధవారం మీడియాతో కన్నడలో మాట్లాడిన రజనీకాంత్ కాలా సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని కన్నడిగులకు మనవి చేశారు.
కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో తాను అదే చెప్పానని, అందులో తప్పేమిలేదని రజనీకాంత్ అంటున్నారు. కావేరీ నీటి పంపిణికి, కాలా సినిమాకు ముడిపెట్టడం ఎంత వరకు న్యాయం అని రజనీకాంత్ అంటున్నారు. కాలా సినిమా విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కన్నడిగులు సహకరించాలని రజనీకాంత్ కన్నడలోనే మనవి చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications