స్టాలిన్ కు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్: ఎందుకంటే!

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యకర్తలు నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే కార్యకర్తలు స్టాలిన్ పుట్టిన రోజు సందర్బంగా అనేక సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

బుధవారం చెన్నైలోని అన్నా ఆరివాలయంలో డీఎంకే నాయకులు, కార్యకర్తలు స్టాలిన్ ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో అనేక మంది పార్టీ కార్యకర్తలు స్టాలిన్ కు ఇష్టం అయిన అనేక రకాల పుస్తకాలు ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Actor Rajinikanth wishing DMk working president stalin on his birthday

డీఎంకే పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఎంకే. స్టాలిన్ ఊహించిన బహుమతి ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. జల్లికట్టు క్రీడ నిర్వహణ కోసం మీరు చేసిన పోరాటానికి గుర్తుగా ఎద్దును ఇస్తున్నారని ఎద్దును ఆయనకు అప్పగించడంతో స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎంకే. స్టాలిన్ కు ఫోన్ చేసి ప్రజల కోసం పోరాటం చెయ్యడానికి మీరు నిండునూరేళ్లు హాయిగా జీవించాలని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు రాజకీయ పార్టీల నాయలకులు, సినీరంగ ప్రముఖులు స్టాలిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు స్టాలిన్ కరుణానిధి ఇంటికి చేరుకుని తల్లిదండ్రలు ఆశీర్వాధం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+