చిత్తుగా ఓడిన సినీనటుడు సాయికుమార్.. డిపాజిట్ గల్లంతు!
కర్ణాటక ఎన్నికల్లో నటుడు సాయికుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. తెలుగు చిత్ర సీమలోనే కాకుండా కన్నడ సినీ పరిశ్రమలో సాయికుమార్‌కు మంచి క్రేజ్ ఉన్నదనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే ఏపీ సరిహద్దులోని బాగేపల్లి శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు. ఆయన నాలుగోస్థానంలో నిలవడం రాజకీయవర్గాలను షాక్ గురి చేసింది. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో సాయికుమార్ చిత్తుగా ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా గల్లంతు కావడం గమనార్హం. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయికుమార్ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.













Click it and Unblock the Notifications