Actor: సింగం, విశ్వరూపం నటుడు, డ్రగ్స్ కేసులో అరెస్టు, ఫ్రెండ్స్ సహవాసం, న్యూయార్క్ టూ ఐటీ హబ్ !

బెంగళూరు/ చెన్నై/ హైదరాబాద్: న్యూయార్క్ ఫిల్మ్ అకాడమిలో శిక్షణ తీసుకుని సినిమా నటుడు అయ్యాడు. నైజీరియా నుంచి భారత్ చేరుకున్న అతను సినిమాల్లో నటించాడు. సింగం సినిమా సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు. సింగం, విశ్వరూపం తదితరల సినిమాలతో పాటు దక్షిణాది సినిమాల్లో నటించిన అతను నటుడిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సహవాస దోషం ఊరికిపోలేదు అనే సామతలా డ్రగ్స్ విక్రయిస్తున్న సొంత దేశానికి చెందిన కొందరు డ్రగ్స్ డీలర్స్ తో చేతులు కలిపిన ఆ నటుడు డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టాడు. తాను సినిమా నటుడు, తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అంటూ ఐటీ హబ్ లో సీక్రేట్ గా డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టాడు. ఇంతకాలం డ్రగ్స్ విక్రయిస్తూ వచ్చిన సంపాధనతో హ్యాపీగా జల్సా చేస్తున్న సింగం-2 నటుడికి గ్రహాలు మొత్తం రివర్స్ కావడంతో లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కిపోయి సెంట్రల్ జైలుపాలైనాడు.

న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ

న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ

నైజీరియాకు చెందిన అబుజాదలిలో నివాసం ఉ:డే చిక్వుమే మాళ్విన్ (45) అనే వ్యక్తి సినిమా నటుడు కావాలని ఆశపడ్డాడు. వెంటనే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమికి వెళ్లి నటనలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నాడు. నైజీరియా నుంచి భారత్ చేరుకున్న చిక్వుమే బెంగళూరు చేరుకుని నివాసం ఉంటూ ఇప్పటి వరకు సుమారు 20 సినిమాల్లో నటించాడు.

 సింగం -2, విశ్వరూపం సినిమాలతో మంచి గుర్తింపు

సింగం -2, విశ్వరూపం సినిమాలతో మంచి గుర్తింపు

గజని ఫేమ్ సూర్యా నటించిన సింగం సినిమా సిరీస్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తమిళ, తెలుగు బాషాల్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సింగం-2 సినిమాలో చిక్వుమే నటించాడు. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం సినిమాలో కూడా ఇతను నటించాడు. తరువాత కన్నడలో అణ్ణాబాండ్, దిల్ వాలే, జంబూ సవారి, పరమాత్మతో పాటు తమిళ, మళయాలం, హిందీ సినిమాల్లో సుమారు 20 సినిమాల్లో చిక్వుమే నటించాడు.

 నీగ్రోల సహవాస దోషం

నీగ్రోల సహవాస దోషం

ఐటీ హబ్ బెంగళూరులో నివాసం ఉంటున్న చిక్వుమే కొందరు నైజీరియాకు చెందిన వారితో తిరుగుతున్నాడు. సహవాస దోషం ఊరికిపోలేదు అనే సామతలా డ్రగ్స్ విక్రయిస్తున్న సొంత దేశం నైజీరియాకు చెందిన కొందరు డ్రగ్స్ డీలర్స్ తో చేతులు కలిపిన నటుడు చిక్వుమే చిన్నగా డ్రగ్స్ విక్రయించడం మొదలు పెట్టాడు.

 పోలీసులకు పక్కా సమాచారం

పోలీసులకు పక్కా సమాచారం

బెంగళూరులోని హెచ్ఆర్ బీఆర్ లేఔట్ లో చిక్వుమే డ్రగ్స్ డెలవరీ ఇవ్వడానికి వచ్చాడని కాండుగొండనహళ్ళి (కేజీ హళ్లి) పోలీసుకలు పక్కాసమచారం అందింది. బుధవారం రాత్రి కేజీ హళ్లి పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న నటుడు చిక్వుమేని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి చిక్వుమే అనేక ప్రయత్నాలు చేసినా పోలీసులు మాత్రం కిలాడీ నటుడిని పట్టుకున్నారు.

 రూ. 8 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్

రూ. 8 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్

తాను సినిమా నటుడు, ఫ్రెండ్ ను కలవడానికి వచ్చాను అంటూ పోలీసులకు మాయమాలు చెప్పాడు. అయితే పోలీసులు చిక్వుమే జోబులు పరిశీలించగా అతని దగ్గర రూ. 8 లక్షల విలువైన 15 గ్రాములు ఎండీఎం, షశీష్ చిక్కిందని కాడుగొండనహళ్లి పోలీసులు చెప్పారు. సినిమా నటుడు కావాలని ఆశపడిన చిక్వుమే ఇప్పుడు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లాడు.

 మెడికల్ వీసాతో వచ్చి డ్రగ్స్ డీలర్

మెడికల్ వీసాతో వచ్చి డ్రగ్స్ డీలర్

మెడికల్ వీసా మీద భారత్ వచ్చిన చిక్వుమే రెండు నెలల పాటు ముంబాయిలో నివాసం ఉన్నాడని, తరువాత బెంగళూరు చేరుకుని ఇక్కడే తిష్ట వేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. సినిమాల్లో నటిస్తున్న చిక్వుమే నిర్మాతలు ఇచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయిస్తూ కాలం గడుపుతున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+