హార్ట్ ఎటాక్‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత
Recommended Video

హార్ట్ ఎటాక్‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!
దుబాయ్: ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ కపూర్‌తో కలిసి ఆమె దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమెకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది.
హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆమె కన్నుమూసినట్లు తెలిపారు. దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. విషయం తెలియడంతో శ్రీదేవి బంధువులు, సన్నిహితులు, మిత్రులు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు.

శ్రీదేవి అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. ఈ విషయాన్ని సంజయ్ కపూర్ ధ్రవీకరించారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్ర సీమలను ఆమె కొన్నేళ్ల పాటు ఏలారు. హఠాత్తుగా ఆమె మృతి చెందడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications