ఓటమి భయం, సీఎం సిద్దూకు ప్రముఖ హీరో ప్రచారం, శ్రీరాములు అంటే, బాలీవుడ్ ఎంట్రీ, దెబ్బకు !

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిపోతారని ఇంటెలిజెన్సీ రిపోర్టులు వచ్చాయని వెలుగు చూసింది. ముందు జాగ్రత చర్యగా సీఎం సిద్దరామయ్య బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్యను గెలిపించడానికి ప్రముఖ హీరో, బాలీవుడ్ నటుడు, సినీరంగ ప్రముఖులు రంగంలోకి దిగారు.

క్లారిటీ లేదు

క్లారిటీ లేదు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరపున బహుబాష నటుడు, దర్శకుడు, ఈగ ఫేం సుదీప్ ప్రచారం చేస్తారని కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య కాని, హీరో సుదీప్ కాని క్లారిటీ ఇవ్వలేదు.

Recommended Video

    కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది
    హీరో ఈగ ఫేం సుదీప్ ఎంట్రీ

    హీరో ఈగ ఫేం సుదీప్ ఎంట్రీ

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరపున తాను ప్రచారం చేస్తానని శుక్రవారం హీరో సుదీప్ ఓ ప్రైవేట్ టీవీ చానల్ తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాను చాముండేశ్వరి నియోజక వర్గంలో మాత్రమే సిద్దరామయ్య తరపున ప్రచారం చేస్తానని, బాగల్ కోటే జిల్లా బాదామిలో సీఎం తరపున ప్రచారం చెయ్యనని హీరో సుదీప్ స్పష్టం చేశారు.

    బళ్లారి శ్రీరాములు అంటే !

    బళ్లారి శ్రీరాములు అంటే !

    చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య తరపున ప్రచారం చెయ్యడానికి సిద్దం అయిన హీరో సుదీప్ అదే ముఖ్యమంత్రికి బాదామిలో ఎందుకు ప్రచారం చెయ్యలేదనే విషయంలో సుదీప్ క్లారిటీ ఇచ్చారు. బళ్లారి బీజేపీ ఎంపీ, బాదామిలో సిద్దరామయ్య మీద పోటీ చేస్తున్న శ్రీరాములు తనకు చాల ఆప్తుడని, ఆయనకు వ్యతిరేకంగా తాను బాదామిలో ప్రచారం చెయ్యలేనని హీరో సుదీప్ వివరణ ఇచ్చారు.

    సీఎం అని ప్రచారం చెయ్యను

    సీఎం అని ప్రచారం చెయ్యను

    సీఎం అని తాను చాముండేశ్వరి నియోజక వర్గంలో ప్రచారం చెయ్యలేదని, సిద్దరామయ్య అని ప్రచారం చేస్తున్నానని హీరో సుదీప్ అన్నారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి కాకముందు తనతో ఎలాగున్నారో, సీఎం అయిన తరువాత అలాగే ఉన్నానని, స్నేహపూర్వకంగా, గౌరవంతో ఆయన తరపున ప్రచారం చేస్తానని హీరో సుదీప్ చెప్పారు.

    శ్రీరాములు, రాజుగౌడ

    శ్రీరాములు, రాజుగౌడ

    సీఎం సిద్దరామయ్య ఎప్పుడు ప్రచారం చెయ్యమంటారో అప్పుడే తాను ప్రచారం చేస్తానని హీరో సుదీప్ అన్నారు. శ్రీరాములు చాల సన్నిహితుడు అని తాను ఆయనకు వ్యతిరేకంగా బాదామిలో ప్రచారం చెయ్యనని హీరో సుదీప్ అన్నారు. రాజుగౌడ తన స్నేహితుడు, ఆయన తరపున తాను ప్రచారం చేస్తానని హీరో సుదీప్ వివరించారు.

    సీఎం కోసం బాలీవుడ్ నటుడు

    సీఎం కోసం బాలీవుడ్ నటుడు

    చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యను ఎలాగైనా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్, బహుబాష సినీ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు, ఆయన కుమార్తె, నటి రిషికా సింగ్ శుక్రవారం చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్య తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బహుబాష నటి జయమాల సిద్దరామయ్య తరపున ప్రచారం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+