స్యాండిల్ వుడ్ హీరోల వార్: నోరు విప్పిన‘ఈగ’సుదీప్, అక్కడే చెడింది !

మెజస్టిక్ సినిమాలో నటించడానికి తనకు అవకాశం కల్పించింది దర్శకుడు పీఎన్. సత్య, రామమూర్తి, రమేష్ మాత్రమే అంటూ దర్శన్ సోషల్ మీడియాలో పోస్టు చేసి బాంబు పేల్చడంతో ఆయనకు బహుబాష నటుడు ఈగ సుదీప్ మధ్య శీతల సమరం

బెంగళూరు: స్యాండిల్ వుడ్ లో ఇద్దరు అగ్రహీరో మద్య మనస్పర్థలు రావడంతో ఆ హీరోల అభిమానుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటున్నది. అయితే చాలెంజింగ్ స్టార్ దర్శన్, బహుబాష నటుడు ఈగ సుదీప్ ల ఫ్రెండ్ షిప్ కు బ్రేక్ పడిందని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.

సుదీప్ నటించిన హుబ్బులి సినిమా ఇటీవల విడుదలై కలెక్షల వర్షం కురిపిస్తున్నది. హుబ్బులి సినిమా విజయోత్సవ వేడకల్లో భాగంగా సుదీప్ కర్ణాటకలోని వివిద జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దర్శన్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం తుమకూరులో స్పంధించడానికి సుదీప్ నిరాకరించారు.

Actor Sudeep Gives Reaction to answer when quizzed about Challenging Star Darshan's tweet

అయితే మంగళవారం ఆయన హుబ్బళిలో మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి దర్శన్ చేసిన ట్వీట్ పై మీరు ఏమి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రెండు రోజుల నుంచి ఈ విషయంపై మౌనంగా ఉన్న సుదీప్ తనదైన శైలిలో స్పందించారు.

నేను మిమ్మల్ని గౌరవిస్తాను... మీరు నన్ను గౌరవించండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దర్శన్ ట్వీట్ కు సుదీప్ దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవడం వలనే ఆయన మౌనంగా ఉంటున్నారని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.

మెజస్టిక్ సినిమాలో తాను నటించడానికి నిరాకరించడంతో ఆ సినిమాలో దర్శన్ నటించాడని, ఈ రోజు మాస్ హీరోగా కన్నడ చిత్రపరిశ్రమలో అగ్రహీరోలలో ఒకరిగా ఉన్నారని సుదీప్ ఓ టీవీ చానల్ ఇంటర్వూలో చెప్పారు.

అయితే మెజస్టిక్ సినిమాలో నటించడానికి తనకు అవకాశం కల్పించింది దర్శకుడు పీఎన్. సత్య, నిర్మాతలురామమూర్తి, రమేష్ మాత్రమే అంటూ దర్శన్ సోషల్ మీడియాలో పోస్టు చేసి బాంబు పేల్చారు. ఈ దెబ్బతో సోషల్ మీడియాలో సుదీప్, దర్శన్ ల మధ్య శీతల సమరం మొదలు కావడంతో ఆ హీరోల అభిమానులు మాత్రం ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+