రాజకీయాల్లోకి రియల్ స్టార్ ఉపేంద్ర, 24 గంటల్లో ఎన్ని వేల ఈ మెయిల్స్ అంటే, అదృష్టం !

రియల్ స్టార్ ఉపేంద్ర పెడుతున్న కొత్త పార్టీకి మద్దతు ఇవ్వడానికి కొన్ని వేల మంది ముందుకు వచ్చారు.

బెంగళూరు: రియల్ స్టార్ ఉపేంద్ర పెడుతున్న కొత్త పార్టీకి మద్దతు ఇవ్వడానికి కొన్ని వేల మంది ముందుకు వచ్చారు. కర్ణాటకతో పాటు దేశ విదేశాల నుంచి ఉపేంద్రకు మద్దతు ఇస్తున్న ప్రజలు మీకు అంతా మంచే జరగాలని ఆశీర్వదించడంతో రియల్ స్టార్ ఉపేంద్ర మురిసిపోతున్నారు.

శనివారం ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ నేను రాజకీయాలు చెయ్యనని, ప్రజల కోసం ప్రజాకీయం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తనకు మద్దతు ఇచ్చే వారు, సలహాలు, సూచనలు ఇచ్చే వారి కోసం మూడు ఈ - మెయిల్ అడ్రస్ లతో పాటు రిప్పీ రెస్టారెంట్ చిరునామకు లేఖలు రాయాలని మనవి చేశారు.

Actor Upendra prajakarana received 15 thousand mails in One day

ఉపేంద్ర మూడు ఈ- మెయిల్ అడ్రస్ లు ఇచ్చిన తరువాత కొన్ని వేల మంది రియల్ స్టార్ కు గుడ్ లక్ చెప్పి, మీకు అండగా మేము ఉంటాం అని ముందుకు వస్తున్నారు. ఉపేంద్ర కొత్తపా ర్టీకి మద్దతుగా ఒక్క రోజులో (ఆదివారం రాత్రి వరకు) 15 వేలకు పైగా ఈ మెయిల్స్ రావడంతో వాటిని పరిశీలించే పనిలో ఉపేంద్ర బిజీబిజీగా ఉన్నారు.

ఉపేంద్ర ప్రవేశపెట్టిన [email protected], [email protected], [email protected] ఈ-మెయిల్స్ కు 24 గంటల్లో 15 వేలకు పైగా ఈ- మెయిల్స్ రావడంతో వాటిని పరిశీలిస్తున్న ఉపేంద్ర తిరిగి రిప్లే ఇస్తున్నారు. మొత్తం మీద సినిమాల్లో సక్సస్ అయిన ఉపేంద్ర రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+