పవన్, చిరు తర్వాత..: అభిమాని అర్చన కోరిక తీర్చిన హీరో విజయ్

చెన్నై: ప్రముఖ తమిళ హీరో విజయ్ తన అభిమాని కోరికను తీర్చాడు. 25 ఏళ్ల అర్చన అనే యువతి విజయ్‌కి మంచి అభిమాని. ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంది. అయితే, తనకు విజయ్‌ని చూడాలని ఉందని చెప్పింది.

ఆమె తనను చూడాలనుకుంటోందనే విషయాన్ని తెలుసుకున్న తన బిజీ షెడ్యూల్ టైంను కొంత పక్కన పెట్టి ఆమె ఆరోగ్య పరిస్థితి, ఆమె కోరిక తెలుసుకొని చెన్నైలోని ఆమె ఇంటికి వచ్చి అర్చనను కలిశారు. కొడంబక్కంలోని తన ఇంటికి విజయ్ రావడంతో ఆమె సంతోషపడింది.

కాగా, ఇటీవల తెలుగు హీరోలు పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు కూడా తమను చూడాలని ఉందన్న చిన్నారులను కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కూడా చిన్నారులు కలవాలని కోరుకున్నారు.

actor vijay fulfils his fan archana's wish

గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన చిరంజీవి హైదరాబాదులోని ఎంఎన్‌జే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు బాలుని పరామర్శించారు. తనను పరామర్శించేందుకు చిరంజీవి రావడంతో చిన్నారి బాలు ఆనందించాడు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

బాలు అదిలాబాద్ జిల్లాకు చెందిన వాడు. అతని వయస్సు పదేళ్లు. అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. బాలు తన ఆరాధ్య నటుడు చిరంజీవిని చూడాలని ఆయన కోరుకున్నాడు. దీంతో చిరు వచ్చి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అదిలాబాద్ జిల్లా జిన్నారంకు చెందిన బాలు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, ఆయన తనను చూడాలని అభిలాష వ్యక్తం చేశారని ఓ చానల్లో చూశానని, దీంతో ఈ రోజు వచ్చానని అన్నారు.

ఆడుతూ పాడుతూ ఉండే ఇలాంటి చిన్నారులకు క్యాన్సర్ రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేసేందుకు అందరు ముందుకు రావాలన్నారు. ఈ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి బాలుడికి ముద్దు ఇచ్చారు. బాలుడికి పూర్తిగా నయమయ్యాక తన ఇంటికి రావాలని ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+