సూపర్ స్టార్ రజనీ రాజకీయ పార్టీకి హీరో విజయ్ మద్దతు: క్లారిటీ ఇచ్చిన థళపతి తండ్రి!
Recommended Video

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ దళపతి రజనీకాంత్ కు తమిళ ప్రముఖ హీరో థళపతి విజయ్ మద్దతు ఇస్తారా? అనే విషయంలో ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది. తమిళనాడులో రజనీకాంత్ తరువాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సూపర్ రజనీకాంత్ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై హీరో విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ స్పంధించారు.

ఎంజీఆర్ సాక్షిగా !
సోమవారం రాత్రి చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిధ్యాలయంలో ఏర్పాటు చేసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ విగ్రహాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ ఊహించినదానికంటే ఘనంగా జరిగింది.

యువకులు కీలకం
ఎంజీఆర్ విశ్వవిధ్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమారు 5 వేల మంది విద్యార్థులతో పాటు రజనీకాంత్ అభిమానులు హాజరైనారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రజనీకాంత్ దేశంలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలని సూచించారు.

నా పార్టీలోకి రావద్దు, రజనీ
తాను కొత్తగా స్థాపిస్తున్న రాజకీయా పార్టీలోకి మీరు రావద్దని ఎంజీఆర్ విశ్వవిధ్యాలయం విద్యార్థులకు సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే వెంటనే రజనీకాంత్ మాట్లాడుతూ, మీరు భాగా చదువుకోవాలని, రాజకీయాల్లోకి ఇప్పుడే రాకూడదని, అయితే మీఓటు మాత్రం తనకే వెయ్యాలని రజనీకాంత్ మనవి చేశారు.

విజయ్ తండ్రి హాజరు
ఎంజీఆర్ విశ్వవిధ్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు థళపతి విజయ్ తండ్రి ఎస్ఏ. చంద్రశేఖర్ హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగాన్ని హీరో విజయ్ తండ్రి ఎస్ఏ. చంద్రశేఖర్ ఆసక్తిగా విన్నారు.

రజనీకి మద్దతుగా విజయ్ ప్రచారం !
ఎంజీఆర్ విశ్వవిధ్యాలయంలో కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఎస్ఏ చంద్రశేఖర్ ను మీడియా కలుసుకుని సూపర్ స్టార్ రజనీకాంత్ కు మద్దతుగా మీ అబ్బాయి హీరో విజయ్ తమిళనాడులో ప్రచారం చేస్తారా ? అని ప్రశ్నించారు.

విజయ్ డిసైడ్ చేస్తాడు
సూపర్ స్టార్ రజనీకాంత్ తో మా కుటుంభానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయంగా రజనీకాంత్ కు మద్దతుగా ప్రచారం చెయ్యాలా ? వద్దా ? అనే విషయం తన కుమారుడు విజయ్ నిర్ణయిస్తాడని ఎస్ఏ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి విజయ్ !
తమిళనాడులో మాస్ హీరోగా థళపతి (లీడర్)గా గుర్తింపుతెచ్చుకున్న హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే హీరో విజయ్ ఈ విషయంపై ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పంధించలేదు.

విజయ్ పక్కా ప్లాన్
హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడానికి పక్కాప్లాన్ వేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే హీరో విజయ్ www.vijaymakkaliyyakam.in అనే వెబ్ సైట్ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు పేర్లు, ఫోన్ నెంబ్లు వాటిలో నమోదు చేసుకుంటున్నారు.

రజనీ, విజయ్
ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ జాతరలో రజనీకాంత్ అభిమానుల మీద హీరో విజయ్ అభిమానులు కత్తులతో దాడి చేసి జైలుకు వెళ్లారు. హీరోల మధ్య ఎలాంటి అభిప్రాయవిభేదాలు లేకపోయినా వారి అభిమానులు కలిసి పని చేస్తారా ? అనే అనుమానాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..
-
73 శాతం ఓట్లతో విజయ్ ప్రభంజనం.. లేటెస్ట్ సర్వే సంచలనం.. ?? -
విజయ్ కు బిగ్ షాక్.. తొలిరోజే ఎన్నికల ప్రచారం రద్దు..! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
విజయ్ పై కక్షసాధింపు? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!












Click it and Unblock the Notifications