ప్రచారం చేస్తా: బిజెపిలోకి తమిళ నటుడు విజయ్
చెన్నై : సీనియర్ తమిళ నటుడు విజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీలో చేరారు. తమిళనాడు రాజధాని చెన్నైలో కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ సమక్షంలో బుధవారం ఆయన కమలం కండువా కప్పుకొన్నారు.
ఈ విషయమై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. భాజపా సాదరంగా విజయ్ కుమార్‌ని ఆహ్వానిస్తోందని చెప్పారు. తమిళ సినీ నటులు బిజెపిలోకి రావడం విజయ్ కుమార్‌తోనే ప్రారంభమవుతోందని ఆయన అన్నారు. బిజెపిలో చేరేందుకు పలువురు సినీ నటులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను బిజెపి తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రాలేదని, తమిళనాడులో బిజెపి ప్రభుత్వం రావాలనే ఆకాంక్షతోనే పార్టీలో చేరినట్లు చెప్పారు. కాగా, విజయ్ కుమార్‌కి దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పేరుంది. ఆయన సుమారు 800లకు పైగా సినిమాల్లో నటించారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications