యాంకర్, నటి మృతి కేసులో లొంగిపోయిన యువ హీరో
రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ మరణించిన కేసులో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కోర్టులో లొంగిపోయాడు. ీ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని ఆయన కోర్టుకు హామీ ఇచ్చాడు.
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ మరణించిన కేసులో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కోర్టులో లొంగిపోయాడు. కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని ఆయన కోర్టుకు హామీ ఇచ్చాడు.
ఇటీవల బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్, నటుడు విక్రమ్.. ఇద్దరూ కలిసి కారులో వెళ్తుండగా అది ఒక్కసారిగా అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. తెలిసిందే. ఈ ప్రమాదంలో సోనికా చౌహాన్ మృతి చెందింది.

పేరెంట్స్ ఆరోపణ
తన కూతురు మృతికి ఆ రోజు కారు నడిపిన విక్రమే కారణమంటూ సోనికా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వ్యక్తిగత పూచీకత్తుపై..
ఈ కేసులో విక్రమ్ ఈ రోజు కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో, రూ.1000 వ్యక్తి గత పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 1న చేపడతామని కోర్టు చెప్పింది.

వారం క్రితం దుర్ఘటన
కాగా, వారం క్రితం.. అంటే గత శనివారం సాయంత్రం ఉదయం నాలుగు గంటలకు ఉత్తర కోల్‌కతాలోని రాష్ బేహరీ ఎవెన్యూ దగ్గర గల లాకేమాల్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం ఇలా..
ప్రమాదానికి గురైన టయోటా కారు డివైడర్‌ను ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమైంది. కారును విక్రమ్ అత్యంత వేగంగా నడుపుతున్నట్లు చెబుతున్నారు.
ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ కూడా పని చేయలేదని తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనంతరం సోనాలి పేరెంట్స్ విక్రమ్ కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications