Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actress: నటి చాందిని తలనొప్పి, రూ. 3 కోట్లు డిమాండ్, బెడ్ రూమ్, సీక్రెట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ ?

చెన్నై: మాజీ మంత్రి తనను పెళ్లి చేసుకుంటానని రహస్యంగా కాపురం చేసి ఇప్పుడు అడ్డంగా తిరుగుతున్నాడని కేసులు పెట్టిన నటి చాందిని మరో బాంబు పేల్చింది. తన భార్యకు విడాకులు ఇచ్చేసి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో ఏకాంతంగా కాపురం చేసే సమయంలో మాజీ మంత్రి మణికందన్ సీక్రెట్ గా బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలు, ఫోటోలు తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. నటి చాందిని వెనుక మనీల్యాండింగ్ ముఠా ఉందని, కొన్ని రోజు క్రితం మూడు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే మీ మీద కేసులు పెడుతామని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మణికందన్ ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి, నటి చాందిని వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది, తనను మణికందన్ కు పరిచయం చేసిన వ్యక్తితో పాటు ఆయనకు సహకరించిన మరో వ్యక్తి మీద నటి చాందిని కేసులు పెట్టడం కలకలం రేపింది.

2017లో పరిచయం

2017లో పరిచయం

మలేషియాకు చెందిన నటి చాందిని నోమాడ్స్ తో పాటు అనేక సినిమాల్లో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న తనను అప్పట్లో మంత్రి పదవిలో ఉన్న మణికందన్ తనతో పరిచయం పెంచుకున్నాడని నటి చాందిని ఆరోపిస్తున్నది. తరువాత అన్నాడీఎంకే నాయకుడు మణికందన్ తనతో చనువుగా ఉండేవాడని నటి చాందిని అంటోంది. 2017లో టూరిజం డెవప్ మెంట్ లో పని చేస్తున్న చరణ్ పరాని అనే వ్యక్తి తనను మణికందన్ కు పరిచయం చేశాడని చాందిని అంటోంది.

సీక్రెట్ కాపురం... సార్ ఫ్రెండ్స్ కు తెలుసు ?

సీక్రెట్ కాపురం... సార్ ఫ్రెండ్స్ కు తెలుసు ?

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మాజీ మంత్రి మణికందన్ తనతో శాస్త్రీనగర్ లో రహస్యంగా కాపురం పెట్టాడని, ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నామని నటి చాందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల వరకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, భార్య హోదాలో నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ తనకు తియ్యటి మాటలు చెప్పాడని చాందిని ఆరోపించింది.

భార్యకు విడాకులు ఇస్తాను.... అబార్షన్ చేసుకో

భార్యకు విడాకులు ఇస్తాను.... అబార్షన్ చేసుకో

తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత నిన్ను అందరి ముందు రెండో పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకుంటే రాజకీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయని మణికందన్ ఇంతకాలం తనకు మాయమాటలు చెప్పాడని చాందిని ఆరోపిస్తున్నది. ఇలా మాయమాటలు చెప్పిన మణికందన్ తనకు ఇప్పటి వరకు మూడు సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని నటి చాందిని ఆరోపిస్తున్నది.

 సార్ దగ్గర బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలు ఉన్నాయి

సార్ దగ్గర బెడ్ రూమ్, బాత్ రూమ్ వీడియోలు ఉన్నాయి

నన్ను పెళ్లి చేసుకోనని చెప్పిన మణికందన్ కు తాను ఎదురు తిరిగానని తనను చంపేస్తానని ఆయన కిరాయి రౌడీలతో బెదరిస్తున్నాడని నటి చాందిని ఆరోపిస్తోంది. నువ్వు పోలీసు కేసు పెడితే ఇంతకాలం రహస్యంగా బెడ్ రూమ్ లో, బాత్ రూమ్ లో తీసుకున్న నీ అశ్లీల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మణికందన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, అతను అన్నంత పని చేస్తాడని, తనకు భయంగా ఉందని ఆరోపిస్తూ నటి చాందిని మూడు రోజుల క్రితం చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

సినిమాలు, రాజకీయాలకు లింక్

సినిమాలు, రాజకీయాలకు లింక్

తమిళనాడులో రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ కు లింక్ ఉండటం ఇప్పుడు కొత్త ఏమీకాదు. ఏన్నో ఏళ్ల నుంచి తమిళనాడులో రాజకీయ నాయకులు, సినీ తారల మద్య సంబంధాలు ఉన్నాయి. తమిళనాడులో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మణికందన్ కు కష్టాలు ఎదురైనాయి. మాజీ మంత్రి మణికందన్, హీరోయిన్ చాందిని సీక్రెట్ లవ్ స్టోరీ, చాందిని, మణికందన్ సహజీవనం వ్యవహారం బయటకు రావడంతో తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపింది.

 రూ. 3 కోట్లకు చాందిని బ్లాక్ మెయిల్ చేస్తోంది

రూ. 3 కోట్లకు చాందిని బ్లాక్ మెయిల్ చేస్తోంది

నటి చాందిని వెనుక మనీల్యాండింగ్ ముఠా ఉందని, కొన్ని రోజు క్రితం మూడు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే మీ మీద కేసులు పెడుతామని కొందరు బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మణికందన్ ఆరోపిస్తున్నారు. చాందిని వెనుక తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారని, తన రాజకీయ జీవితం అంతం చెయ్యడానికి కుట్ర జరుగుతోందని, చట్టపరంగా, న్యాయస్థానంలో తాను చాందినిని ఎదుర్కొంటానని మాజీ మంత్రి మణికందన్ అంటున్నాడు.

మూడు చోట్ల కేసులు పెట్టిన చాందిని

మూడు చోట్ల కేసులు పెట్టిన చాందిని


చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాయంతో పాటు చెన్నైలోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ లో, అడయార్ మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా చాందిని మాజీ మంత్రి మణికందన్ మీద కేసు పెట్టింది. తనకు మాజీ మంత్రి మణికందన్ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని నటి చాందిని పోలీసు అధికారులకు మనవి చేస్తోంది.

 పోలీసులు ఏం చేస్తున్నారంటే ?

పోలీసులు ఏం చేస్తున్నారంటే ?

నటి చాందిని పోలీసులను తికమక పట్టిస్తోందని సమాచారం. ఈ కేసులో మణికందన్ కు చాందిని పరిచయం చేసిన పరానీని పోలీసులు విచారణ చేసి అతన్ని సాక్షిగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే మాజీ మంత్రి మణికందన్ మీద ఆరు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయనిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని, ఆచూతూచి అడుగులు వెయ్యాలని, లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని ఆలోచిస్తున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+