Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నటి కిడ్నాప్, లైంగిక దాడి: దిలీప్ భార్య, నటి కావ్య మాధవన్, ఆమె తల్లిని విచారించాలని!

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ రెండో భార్య కావ్య మాధవన్, ఆమె తల్లిని విచారించి వివరాలు సేకరించడానికి కేరళ పోలీసులు సిద్దం అయ్యారు. నటి కిడ్నాప్, లైంగిక

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ రెండో భార్య కావ్య మాధవన్, ఆమె తల్లిని విచారించి వివరాలు సేకరించడానికి కేరళ పోలీసులు సిద్దం అయ్యారు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో కావ్య మాధవన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని మలయాళం మీడియా కోడైకూస్తోంది.

నటి కావ్య మాధవన్ కు చెందిన ఇ కామర్స్ షోరూంలోనే నటిపై జరిగిన లైంగిక దాడి వీడియో తీసిన మెమరీ కార్డు దాచిపెట్టారని సమాచారం. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఇప్పటికే అరెస్టు అయిన పల్సర్ సుని ఇచ్చిన వివరాలు ఆధారంగా నటి కావ్య మాధవన్ ను విచారించాలని పోలీసులు సిద్దం అయ్యారు.

Actress Bhavana case strong evidences against Kavya Madhavan

ఇదే కేసులో నటి కావ్య మాధవన్ తో పాటు ఆమె తల్లిని విచారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన హీరో దిలీప్ ను కస్టడిలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దిలీప్, పల్సర్ సునీని ఒకే చోట కుర్చోపెట్టి విచారణ చెయ్యాలని కేరళ పోలీసులు సిద్దం అయ్యారు.

మంగళవారం సాయంత్రంలోపు నటి కావ్య మాధవన్ ను విచారించడానికి రంగం సిద్దం అయ్యిందని మలయాళం మీడియా కథనం ప్రసారం చేసింది. నటి కావ్య మాధవన్ కు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేరళ పోలీసులు సమాచారం ఇచ్చారని తెలిసింది. నటి లైంగిక దాడి కేసులో కావ్య మాధవన్ కు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్షాలు సేకరించారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+