Actress: హోటల్ లో రూమ్ తీసుకున్న నటి, రాత్రి అక్కడే ?, రూమ్ లో శవమైన నటి !

ముంబాయి/పూణే: మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న యువతి తరువాత సినిమాల్లో చాన్స్ కోసం ప్రయత్నించింది. కమర్షియల్ యాడ్స్ లో నటించిన మోడల్ చాలా తక్కువ సమయంలో సినిమా చాన్స్ లు దక్కించుకుంది. సినిమాల్లో నటిస్తున్న ఆమెకు సినిమా అవకాశాలు క్యూకట్టాయి. హోటల్ కు వెళ్లి రూమ్ తీసుకున్న నటి రాత్రి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ తీసుకెళ్లిన హోటల్ లోని బాయ్స్ ఆ నటికి ఇచ్చారు. మరుసటి రోజు ఆ నటి హోటల్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనపడటం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ నటి డెత్ నోట్ రాసిపెట్టింది. అయితే నటి ఆత్మహత్య వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 ప్రముఖ మోడల్

ప్రముఖ మోడల్

మహారాష్ట్రకు చెందిన ఆకాంక్ష మోహన్ అలియాస్ ఆకాంక్ష అనే యువతి మోడల్ గా రంగప్రవేశం చేసింది. మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష మోహన్ తరువాత హిందీ సినిమాల్లో చాన్స్ కోసం ప్రయత్నించింది. కమర్షియల్ యాడ్స్ లో నటించిన మోడల్ ఆకాంక్ష మోహన్ చాలా తక్కువ సమయంలో బాలీవుడ్ సినిమా చాన్స్ లు దక్కించుకుంది.

 ముంబాయిలో నివాసం

ముంబాయిలో నివాసం

ముంబాయిలోని లోఖండ్ వాలా ప్రాంతంలోని యమునా నగర్ సోసైటీలో ఆకాంక్ష మోహన్ నివాసం ఉంటున్నది. సొంత ఇంటిలో నివాసం ఉంటున్న ఆకాంక్ష మోహన్ బాలీవుడ్ సినిమాల్లో, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నది. ఇటీవల షూటింగ్ ల్లో ఆకాంక్ష మోహన్ చాలా బిజీగా గడుపుతున్నది.

 హోటల్ లో రూమ్ తీసుకున్న నటి

హోటల్ లో రూమ్ తీసుకున్న నటి

ముంబాయిలోని అంధేరీలోని ఓ స్టార్ హోటల్ కు వెళ్లిన బాలీవుడ్ నటి ఆకాంక్ష మోహన్ రూమ్ తీసుకున్నది. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో నటి ఆకాంక్ష మోహన్ ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ తీసుకెళ్లిన హోటల్ లోని బాయ్స్ నటి ఆకాంక్షకు ఇచ్చారు. రాత్రి నటి ఆకాంక్ష మోహన్ రూమ్ లోనే ఉండిపోయింది.

 ఆత్మహత్య చేసుకున్న నటి

ఆత్మహత్య చేసుకున్న నటి

మరుసటి రోజు ఎంతసేపు అయినా నటి ఆకాంక్ష మోహన్ హోటల్ రూమ్ లో నుంచి బయటకురాలేదు. రూమ్ బాయ్స్, హౌస్ కీపింగ్ చేసేవాళ్లు వెళ్లి రూమ్ బెల్ వేసినా ఆకాంక్ష నుంచి స్పందనరాలేదు. హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వేరే లాక్ తో రూమ్ తలుపులు తీసి చూడగా నటి ఆంకాక్ష మోహన్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనపడటం కలకలం రేపింది.

 డెత్ నోట్ లో ఏముంది ?

డెత్ నోట్ లో ఏముంది ?

ఆత్మహత్య చేసుకునే ముందు బాలీవుడ్ నటి ఆకాంక్ష మోహన్ డెత్ నోట్ రాసిపెట్టింది. నా ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదు. నేను ఇంతకాలం సంతోషంగానే ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు శాంతి అవసరం అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆకాంక్ష మోహన్ డెత్ నోట్ రాసిందని పోలీసులు అంటున్నారు. అయితే ఆకాంక్ష మోహన్ ఆత్మహత్య వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముంబాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+