టీవీ నటిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి: వెంటిలేటర్‌పై చికిత్స అందించినా
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ఇప్పటిదాకా పలువురు ప్రముఖులు కన్నుమూశారు. రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన పలువురు నాయకులు, కళాకారులను కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది. తాజాగా మరో నటి ఈ మహమ్మారికి బలి అయ్యారు. ఆమె పేరు దివ్యా భట్నాగర్. 34 సంవత్సరాల దివ్యా భట్నాగర్.. కొన్ని హిందీ టీవీ సీరియళ్లలో నటించారు. కొద్దిరోజుల కిందట ఆమె కరోనా వైరస్ బారిన పడ్డారు. ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
యే రిష్తా క్యా కెహ్లాతా హై సీరియల్‌తో భట్నాగర్ పాపులర్ అయ్యారు. ఇందులో గులాబో పాత్రతో ఆమె సుపరిచితురాలు. ఒకట్రెండ్ టీవీ సీరియళ్లు సెట్స్ మీద ఉన్నాయి. షూటింగులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. దీనితో ఆమె ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరింత విషమించింది.

ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు డాక్టర్లు. ఆమెను కాపాడటానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఆమె మరణించారు. ఆరోగ్యం కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో మరింత తిరగబెట్టిందని దివ్యా భట్నాగర్ స్నేహితుడు యువరాజ్ రఘువంశి చెప్పారు. గంట పాటు ఆమె శ్వాస అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని, తెల్లవారు జామున 3 గంటలకు ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు.
ఆమె మరణం పట్ల హిందీ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు నటులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. శిల్పా శిరోద్కర్, డివోలినా భట్టాచార్జీ సంతాపం తెలిపారు. ఓ మంచి నటిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యా భట్నాగర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications