మిని స్కర్ట్ రాధే మా పై కేసు పెట్టిన బాలివుడ్ నటి
ముంబై: అధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ వలన తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని బాలివుడ్ నటి, గతంలో బిగ్ బాస్ రియాలిటి షో పోటిలో పోల్గోన్న డాలి బింద్రా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనను చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు.
రాధే మా మీద ఫిర్యాదు చేస్తూ ముంబై కమిషనర్ రాకేష్ మారియాకు డాలి బింద్రా లేఖ రాశారు. రెండు రోజుల క్రితం డాలి బింద్రా రాధే మాపై ట్విట్ చేశారు. రాధే మా ఆధ్యాత్మిక దేవత కాదని ఆమె భక్తులకు సూచించారు. ఇదే విషయంపై రాధే మా, ఆమె భక్తులు డాలి బింద్రాకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో జరిగిన బిగ్ బాస్ రియాలిటి షో పోటిలలో డాలి బింద్రా పాల్గొన్నారు. గతంలో రాధే మా భక్తురాలిగా డాలి బింద్రా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ముంబై పోలీసులు నిక్కీ గుప్తా అనే మహిళ ఫిర్యాదు చెయ్యడంతో రాధే మా మీద వరకట్నం వేదింపుల కేసు నమోదు చేశారు.

ఈనెల 14వ తేది (శుక్రవారం) విచారణకు రావాలని రాధే మాకు సమన్లు జారీ చేశారు. అయితే ఇప్పుడు డాలి బింద్రా ఫిర్యాదు చెయ్యడంతో మళ్లి ఇంకో కేసు నమోదు అయ్యింది. గుజరాత్ కు చెందిన ఒకే కుటుంబంలోని 7గురు ఆత్మహత్యలు చేసుకోవడానికి రాధే మా కారణం అని ఫిర్యాదు చేశారు.
ఇటివల మిని స్కర్ట్ వేసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చిన రాధే మా క్లిప్పింగ్ లపై వివాదం చెలరేగింది. ఇప్పుడు బాలివుడ్ నటి డాలి బింద్రా సైతం రాధే మా మీద ఫిర్యాదు చెయ్యడంతో ఇక ముందు ఎంత మంది ఆమె మీద ఫిర్యాదులు చేస్తారో వేచి చూడాలని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications