నాడు నగ్నంగా ఫోజిచ్చిన నటిని కారులోంచి లాగి కొట్టిన బిజినెస్‌మన్

ముంబై: ఓ బాలీవుడ్ నటిని ప్రముఖ వ్యాపారవేత్త కారులో నుండి లాగి కొట్టిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్, జరా సంభాల్ కె తదితర చిత్రాల్లో నటించిన నటి యోగితా దండేకర్‌ను ముంబైలోని జుహు ప్రంతంలో వ్యాపారవేత్త హన్సరాజ్ సురాన, ఆయన కారు డ్రైవర్ కృష్ణ కుమార్ వైద్యనాథ్‌లు వేధించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.

తనను కారు నుంచి బయటకు లాగి పదేపదే చెంపపై కొట్టారని యోగిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం 10 నిమిషాల పాటు మాటలతో, చేతలతో తనను వేధిస్తున్నా చుట్టూ ఉన్నవారిలో ఎవరూ తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆమె ఆరోపించారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసునమోదు చేసి రిమాండ్‌కు పంపామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటలకు జరిగింది. హన్సరాజ్ సురన మల్టీనేషనల్ కంపెనీ డైరెక్టర్. తాను వారి నుండి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు నటి పోలీసులకు చెప్పింది.

actress dragged from car, slapped by businessman

ఆమె ఫిర్యాదుతో సురన, వైద్యనాథ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్త హన్సరాజ్ సురన, అతని డ్రైవర్ పైన సెక్షన్ 354(వేధింపులు) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వారిని గురువారం వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. అనంతరం వారికి బెయిల్ వచ్చింది. దీని పైన వ్యాఖ్యానించేందుకు సురన అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. కాగా, దండేడ్కర్ అన్నా హజారేకు మద్దతుగా 2011లో నగ్నంగా పోజులు ఇచ్చి వార్తల్లోకి ఎక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+