కారు నుంచి బయటికి లాగి! నడిరోడ్డుపై ‘టాలీవుడ్’ నటిపై రేప్ యత్నం
Recommended Video

నడిరోడ్డుపై ‘టాలీవుడ్’నటిపై రేప్ యత్నం : స్పందించని టాలీవుడ్ హీరోలు | Oneindia Telugu
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ ప్రముఖ టాలీవుడ్ నటిపై కోల్‌కతాలో అత్యాచారయత్నం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాలీవుడ్(కోల్‌కతా)కు చెందిన ప్రముఖ నటి కాంచనా మోత్రా షూటింగ్ పూర్తి చేసుకుని బేహాలాలో ఉన్న తన నివాసానికి వెళ్తోంది. దారిలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను నిలువరించి కారు తాళాలను లాక్కున్నారు. ఆమెను బయటికి లాగి అసభ్యంగా ప్రవర్తించారు.

వారిని ప్రతిఘటించిన ఆమె.. అక్కడ్నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలోఉన్న మరో వ్యక్తికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications