Actress: అపార్ట్ మెంట్ లో భాయ్ ఫ్రెండ్ తో ఉంటున్న నటి ఆత్మహత్య, డెత్ నోట్, రష్మిక ఊరు !

బెంగళూరు: టీవీ సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన యువతి ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నది. టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న యువతి కుటుంబ సభ్యులు మరో ఊరిలో నివాసం ఉంటున్నారు. రాజధానిలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి అపార్ట్ మెంట్ లో సహజీవనం సాగిస్తున్న నటి రాత్రి కూడా అదే ఫ్లాట్స్ లో ఉంటున్న వారికి కనపడింది. ఉదయం ప్రియుడు టిఫిన్ తీసుకురావడానికి హోటల్ కు వెళ్లాడు. ప్రియుడు అపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టి చూడగా నటి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది, నటి ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టింది. డెత్ నోట్ లోని వివరాలు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాటి నటీనటులు షాక్ అయ్యారు.

 గీతాగోవిందం ఫేమ్ రష్మిక మందన్న ఊరు

గీతాగోవిందం ఫేమ్ రష్మిక మందన్న ఊరు

గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు ఫేమ్ రష్మిక మందన్న సొంత జిల్లా అయిన కొడుగు జిల్లాలోని కుశాలనగరకు చెందిన సౌజన్యా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంది. బెంగళూరు చేరుకున్ సౌజన్యా పలు కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సౌజన్యాకు మంచి భవిష్యత్తు ఉందని సాటి నటీనటులు ఇంతకు ముందే అభిప్రాయం వ్యక్తం చేశారు.

 అపార్ట్ మెంట్ లో భాయ్ ఫ్రెండ్ సహజీవనం

అపార్ట్ మెంట్ లో భాయ్ ఫ్రెండ్ సహజీవనం

టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న సౌజన్యా కుటుంబ సభ్యులు కోడుగు జిల్లాలోని కుశాలనగర ఊరిలో నివాసం ఉంటున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బెంగళూరు దక్షిణ తాలుకా దోడ్డబెలే ఏరియాలో సౌజన్యా ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి అపార్ట్ మెంట్ లో సహజీవనం సాగిస్తున్నదని సమాచారం.

 రాత్రి అంతా ఓకే.....ఉదయం షాక్

రాత్రి అంతా ఓకే.....ఉదయం షాక్

నటి సౌజన్యా రాత్రి ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్స్ లో ఉంటున్న వారికి కనపడింది. ఆ సమయంలో సౌజన్యా బాగానే ఉందని తెలిసింది. గురువారం ఉదయం (సెప్టెంబర్ 30వ తేదీ) సౌజన్యా ప్రియుడు అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు వచ్చి టిఫిన్ తీసుకురావడానికి హోటల్ కు వెళ్లాడు. ప్రియుడు అపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టి చూడగా నటి సౌజన్యా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది,

డెత్ నోట్ లో నటి ఏం రాసిందంటే ?

డెత్ నోట్ లో నటి ఏం రాసిందంటే ?

సౌజన్యా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టిందని కంబళగూడు పోలీసులు అంటున్నారు. డెత్ నోట్ లో తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదు, అనారోగ్యంతో నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు మంచి భవిష్యుత్తు ఉందని తెలుసు, అయితే ఈ జీవితం ఇంతటితో ముగిస్తున్నాను, మమ్మీ, డాడీ, అన్నా నన్ను క్షమించండి, నేను ఇంటికి రావాలని అనుకున్నాను, కానీ ఇలా వస్తానని అనునకోలేదు అని రాసి ఉందని పోలీసులు చెప్పారు.

Recommended Video

    Actress Ramya Krishna Biography | Oneindia Telugu
     ప్రియుడా ? పీఏనా

    ప్రియుడా ? పీఏనా

    నేను రాస్తున్న డెత్ నోటో దయచేసి మీడియాకు మాత్రం లీక్ చెయ్యకండి అని సౌజన్యా రిసిపెట్టిందని పోలీసులు చెప్పారు. సౌంజన్యాతో పాటు ఆమె అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్నది ప్రియుడు కాదు పీఏ అని కొందరు అంటున్నారు. పీఏ అయితే పగలు రాత్రి అక్కడే ఎందుకు ఉంటున్నాడు అనే విషయం అర్థం కావడం లేదని అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న కొందరు అంటున్నారని తెలిసింది. సౌజన్యా డెత్ నోట్ లోని వివరాలు తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాటి నటీనటులు షాక్ అయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+