మమత బెనర్జీకి ఝలక్ ఇచ్చిన ప్రముఖ నటి.. !!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి సినీ గ్లామర్, రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రముఖ బెంగాలీ నటి కోయల్ మల్లిక్ అలియాస్ రుక్మిణి మల్లిక్ అధికార బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమెను తమ అభ్యర్థిగా బీజేపీ జాతీయ అధిష్ఠానం ప్రకటించిన మరుసటి రోజే ఆమె కాషాయ జెండా కప్పుకొన్నారు. కొద్దిసేపటి కిందటే నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. ఇదివరకు తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ నుంచి రాజ్యసభకు రీనామినేట్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ సీనియర్ నటుడు రంజిత్ మల్లిక్ కుమార్తె అయిన కోయల్. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ పార్టీ ప్రధాన కార్యదర్శి శశి అగ్నిహోత్రి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. శశి అగ్నిహోత్రి ఆమెకు పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఆ వెంటనే ఆమె అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ రాజ్యసభ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

కోయల్ మల్లిక్‌కు బెంగాల్ రాజకీయాలతో సుదీర్ఘకాలంగా బలమైన సంబంధం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి జూలై 16 వరకు మాత్రమే ఆమె ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ఓడిపోవడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్ బై చెప్పారు. కొంతకాలం పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా బీజేపీలో చేరారు.
పశ్చిమ బెంగాల్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లల్లో ఖాళీగా ఉన్న మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటం వల్ల కోయల్ మల్లిక్ రాజ్యసభ సభ్యురాలిగా విజయం సాధించడం దాదాపు ఖాయం. బీజేపీ ఎంపీగా ఎలాంటి బాధ్యతాయుత పాత్ర పోషిస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
#WATCH | Kolkata: BJP leader Rukmini Mallick (Koel Mallick) arrived at the West Bengal Legislative Assembly to file her nomination for the upcoming Rajya Sabha by-election in West Bengal. https://t.co/EIDPsk1M76
— ANI (@ANI) October 5, 2026













Click it and Unblock the Notifications
