గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నటి మనోరమ

ప్రస్తుతం ఆమె శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మనోరమ ఎంజీఆర్, ఎన్‌టీఆర్, శివాజీగణేశన్, ఏఎన్ఆర్‌ల నాటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.
గత ఏడాది శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో అక్కడ స్నానాల గదిలో జారిపడి ఆమె తలకు గాయమైంది. అంతేగాక మోకాళ్లకు శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావడంతో ఆమె గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరమై ఇటీవలే ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు.
రజనీకాంత్, చిరంజీవి లాంటి హీరోలతో పాటు, ఇతర హీరోలకు తల్లి, బామ్మ పాత్రల్లో మనోరమ నటించారు. ఆమెకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంది.












Click it and Unblock the Notifications