Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ: నటి నగ్మా రియాక్షన్ ఇది, పని లేదా, ఎందుకు ?

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఎలా ఉన్నా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు ఆయన నిద్రలేకుండా చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఎలా ఉన్నా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు ఆయన నిద్రలేకుండా చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తలైవా మా పార్టీలోకి రావాలంటూ, కాదు మా పార్టీలోకి రావాలంటూ ఇరు పార్టీలకు చెందిన కొందరు నాయకులు రచ్చకెక్కుతున్నారు.

రజనీకాంత్ బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ కొన్ని రోజుల నుంచి బహిరంగంగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో తమిళిసై సౌందరరాజన్ మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బు సైటర్లు వేశారు.

రంగంలోకి కాంగ్రెస్ లీడర్, నటి నగ్మా

రంగంలోకి కాంగ్రెస్ లీడర్, నటి నగ్మా

సౌంత్ ఇండియా సూపర్ స్టార్ రాజకీయాల్లో వస్తే తాము స్వాగతిస్తామని అఖిల భారత మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలనాటి నటి నగ్మా అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లో వచ్చి సేవ చెయ్యాలని చాలమంది ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

పని లేదా, ఖాళీగా ఉన్నారా !

పని లేదా, ఖాళీగా ఉన్నారా !

ఇదే సమయంలో నగ్మా వెంటనే తన ప్రత్యర్థి బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. రజనీకాంత్ బీజేపీలో చేరాలంటూ బహిరంగంగా ఆహ్వానించిన తమిళిసై సౌందరరాజన్ మీద విరుచుకుపడ్డారు. ఆమెకు పనిపాటలేకనే సూపర్ స్టార్ రజనీకాంత్ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

ప్రజల సమస్యలు పట్టావా ?

ప్రజల సమస్యలు పట్టావా ?

తమిళనాడులో అనేక సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చెయ్యాలని తమిళిసైకి చూసించారు. అంతే కాని పదేపదే రజనీకాంత్ బీజేపీలోకి రావాలంటూ పిలుపునిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని నగ్మా ఎద్దేవ చేశారు. తమిళనాడు ప్రజలు మద్యం షాప్ లు తొలగించాలని పోరాటం చేస్తుంటే మీరు వారికి మద్దతు ఇచ్చారా ? అని తమిళిసై సౌందరరాజన్ ను నగ్మా సూటిగా ప్రశ్నించారు.

రజనీకాంత్ కు తెలుసు, మళ్లీ మేము ?

రజనీకాంత్ కు తెలుసు, మళ్లీ మేము ?

రాజకీయాల్లోకి వస్తే రజనీకాంత్ ఎవ్వరికి మద్దతు ఇవ్వాలి ? అనే విషయం ఆనకు తెలుసు అని నగ్మా అన్నారు. అంతే కాని ఆయన రాజకీయ రంగప్రవేశం చెయ్యకముందే ఈ విషయంపై మాట్లాడటం మంచిది కాదని నగ్మా అభిప్రాయం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ ను కలిసిన నగ్మా

రజనీకాంత్ ను కలిసిన నగ్మా

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఇటీవల నగ్మా రజనీకాంత్ ఇంటికి వెళ్లి సూపర్ స్టార్ ను కలిశారు. రజనీకాంత్ ను సత్కరించిన నగ్మా కొంతసేపు ఆయనతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నగ్మా తాను మర్యాదపూర్వకంగా సూపర్ స్టార్ ను కలిశానని వివరణ ఇచ్చారు.

రజనీ కోసం స్కెచ్ వేస్తున్న కాంగ్రెస్ ?

రజనీ కోసం స్కెచ్ వేస్తున్న కాంగ్రెస్ ?

రజనీకాంత్ ను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అందుకే ఇటీవల తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులతో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చిదంబరం, నగ్మా తదితరులు వరుసగా ఆయన్ను కలుస్తున్నారు.

నో చాన్స్ అంటున్నారు, అయితే ?

నో చాన్స్ అంటున్నారు, అయితే ?

తనను కలుస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో రజనీకాంత్ స్నేహపూర్వకంగానే మాట్లాడుతున్నారు. వారి మద్య రాజకీయ విషయాలపై చర్చలు జరిగినా వాటి వివరాలు మాత్రం బయటకురాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ పార్టీలో చేరుతాను అని మాత్రం ఎవ్వరికీ మాట ఇవ్వలేదని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+