ఎమ్మెల్యే కిస్, యువకుడి టచ్: నగ్మాకు టఫ్ (పిక్చర్స్)

లక్నో: దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన ప్రముఖ నటి నగ్మా ఇప్పుడు రాజకీయాల్లో టఫ్ టైంను ఎదుర్కొంటున్నారు. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ భాషల్లో ఆమె అగ్ర హీరోల సరసన నటించారు. ఎన్నో సక్సెస్‌లు చూశారు.

దశాబ్దానికి పైగా ఆమె చిత్ర రంగంలో దూసుకు పోయారు. ఆ తర్వాత సామాజిక అంశాల పైన దృష్టి సారించారు. ఆ తర్వాత ఆమె రాజకీయల ద్వారా సేవ చేయవచ్చునని భావించి కాంగ్రెసు పార్టీలో చేరారు.

నగ్మా రాజకీయ ఆరంగేట్రం జరిగి సంవత్సరాలు అయినప్పటికీ... పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మాత్రం గత నెలలోనే అయ్యారని చెప్పవచ్చు. ఆమె మొదటిసారి మీరట్ లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

నగ్మా

నగ్మా

మీరట్‌లో తన విజయంపై ధీమాగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్న నగ్మాకు ఒకదాని వెనుక ఒకటి.. రెండు సంఘటనలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

నగ్మా

నగ్మా

మొదటి ఘటనలో సొంత పార్టీకి చెందిన హపూర్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు గజరాజ్ సింగ్ ఆమెను బహిరంగంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. ఈ సమయంలో నగ్మా అతనిని తోసివేసింది.

 నగ్మా

నగ్మా

సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే నటి, రాజకీయ నాయకురాలు నగ్మాను ముద్దు పెట్టుకోవడం కాంగ్రెసు పార్టీని, ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది.

నగ్మా

నగ్మా

అయితే, ఈ ఘటనపై మరో రకమైన వాదన కూడా వినిపించింది. ఆయన ముద్దు పెట్టుకునేందుకు రాలేదని, చెవిలో ఏదో చెప్పేందుకు వచ్చారని వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది.

నగ్మా

నగ్మా

ఆ తర్వాత ప్రచారం సమయంలో ఓ యువకుడు నగ్మాను తాకాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఆమెకు అదనపు సెక్యూరిటీని ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ ఈసిని కోరింది. కాగా, ఈ వేధింపులు, అసభ్యత పైన ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. రెండు ఘటనల నేపథ్యంలో ఆమె పకడ్బంధీగా ప్రచారం చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+