సల్మాన్‌గా ఫోజు పెట్టి న్యూడ్ ఫోటో అడిగాడు: నటి

ఆ వ్యక్తిని గుర్తించడానికి వెన్రాయ్ పోలీసులు ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల సాయం కోరినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ మాదిరిగా సెప్టెంబర్‌లో తాను ఫేస్ బుక్కులో ఓ పేజీ చూశానని, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ఫొటోలు చాలా అప్‌లోడ్ అయ్యాయని, దాంతో తాను అది సల్మాన్ ఖాన్ అధికారిక పేజ్ అనుకున్నానని ఆమె వివరించారు.
సల్మాన్ ఖాన్ అనుకుని తాను మాట్లాడుతూ వచ్చానని, గుర్తు తెలియని వ్యక్తి తనను సల్మాన్ ఖాన్‌గా చెప్పుకుంటూ మాట్లాడాడని, గత సంబంధాల గురించి మాట్లాడాడని నటి మీడియా ప్రతినిధులతో చెప్పారు. వైబ్ పేజీకి లక్ష లైక్స్ వచ్చాయని, దాంతో అనుమానం రాలేదని అన్నారు.
ఈ నెలారంభంలో సంభాషణ జరుపుతుండగా ఇందులో ఏదో మాయ ఉందనినిపించిందని ఆమె చెప్పారు. అతను అసభ్యకరమైన భాష వాడుతూ వచ్చాడని, తన న్యూడ్ ఫోటోలను అడిగాడని, దాంతో అతను సల్మాన్ ఖాన్ కాదని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.












Click it and Unblock the Notifications