హసన్‌నుండి దేవేగౌడపై బిజెపి అభ్యర్థిగా నటి శృతి పోటీ!

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి శృతి... హసన్ నియోజకవర్గం నుండి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని శృతిని బిజెపి నేతలు సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

శృతి తల్లి హోలెనరసిపురాకు చెందిన వారు. ఇదే ప్రాంతం నుండి హెచ్‌డి దేవేగౌడ వచ్చారు. ఇతను ప్రస్తుతం హసన్ నుండి సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను దేవేగౌడ ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు.

Actress Shruti may Contest Lok Sabha Elections

శృతి కనుక బిజెపి ఆఫర్‌ను అంగీకరిస్తే ఇక... అదే మట్టి నుండి వచ్చిన ఇద్దరి మధ్య హోరాహోరీ ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాగా, ఇప్పటి వరకు బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

దేవేగౌడ మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధ్యక్షులు. ఏప్రిల్ 17న జరగనున్న లోకసభ ఎన్నికలకు పార్టీ సోమవారం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో దేవేగౌడతో పాటు కర్నాటకమాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కూతురు గీతా శివరాజ్ కుమార్‌కు కూడా చోటు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+