జల్లికట్టుపై రగడ: హీరోయిన్ త్రిషపై దాడికి యత్నం
త్రిషకు జల్లికట్టు మద్దతుదారుల సెగ తగిలింది. శివగంగ జిల్లాలో ఆమె సినిమా షూటింగును వారు అడ్డుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చెన్నై: త్రిషపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంపై ఆమె మీద పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చెన్నైకు 450 కి.మీ.ల దూరంలో జరుగుతున్న త్రిష చిత్ర షూటింగ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు.
పెటా కార్యకర్తగా ఉన్న త్రిష జల్లికట్టు క్రీడను వ్యతిరేకించారు. దాంతో శివగంగలో జరుగుతున్న 'గర్జన' చిత్ర షూటింగ్ పలువురు జల్లికట్టు మద్దతుదారులు అడ్డుకున్నారు. వ్యానులో ఉన్న త్రిష బయటకు రావాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

త్రిష క్షమాపణలు చెప్పాలని, జంతు సంరక్షణ హక్కుల సంస్థకు ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అప్పటివరకూ చిత్రీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. జల్లికట్టుకు వ్యతిరేకంగాపెటా పెద్దయెత్తున ప్రచారం చేయడంతో పాటు దాన్ని నిర్వహించడం కోర్టు ఉల్లంఘన అవుతుందని చెబుతోంది.
జల్లికట్టుకు మద్దతు తెలుపుతున్నవారంతా పెటాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications