Actress: తిరిగిరాని లోకాలకు నటి జయంతి, రజనీకాంత్ కు చెల్లి, చిరంజీవికి తల్లిగా, 500 సినిమాల్లో !
బెంగళూరు/ హైదరాబాద్: బహుబాష నటి జయంతి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కు చెల్లిగా, కొదమసింహంలో చిరంజీవికి తల్లిగా, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, డాక్టర్ రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీగణేషన్, కృష్ణ, కృష్ణంరాజు, బాలక్రిష్ణతో పాటు తెలుగు ప్రముఖ హీరోలు అందరితో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ బాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించిన జయంతి సోమవారం బెంగళూరులోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి ఆకస్మికంగా మరణించడంతో భారతదేశంలోని అన్ని బాషల సినీరంగ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగింటి ఆడపడుచు
మద్రాసు ఉమ్మడి రాష్ట్రాలు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక) కలిసి ఉన్న సమయంలో బళ్లారిలో జన్మించిన కుసుమ కుమారి అలియాస్ శారద జయంతి అలియాస్ జయంతి (76) సోమవారం ఉదయం బెంగళూరులోని ఆమె ఇంటిలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాలం, హిందీతో పాటు ఆరు బాషల్లో సుమారు 500కు పైగా సినిమాల్లో నటించిన జయంతి ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

రాజ్ కుమార్ తో రికార్డు బ్రేక్
కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్ కుమార్, జయంతి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే కన్నడ సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి. డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి జయంతి 45 సినిమాల్లో నటించారు. 1963 లో జీను గూడు (తేనె పుట్ట) అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన జయంతి తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రజనీకాంత్ కు చెల్లి, కొదమసింహంకు తల్లి
రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పెదరాయుడు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, పెదరాయుడు సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు జయంతి చెల్లిగా, మోహన్ బాబుకు అత్తగా నటించారు. మెగస్టార్ చిరంజీవి నంటించిన కొదమసింహం సినిమాలో చిరంజీవిగా తల్లిగా నటించిన జయంతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఫేమస్ హీరోలు అందరితో నటించిన జయంతి
మాజీ ముఖ్యమంత్రి, అలనాటి నెంబర్ వన్ హీరో నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) అక్కినేని నాగేశ్వరావు, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, ఎంజీఆర్, శివాజీగణేషన్, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్ తో పాటు తెలుగు ప్రముఖ హీరోలు అందరితో కలిసి జయంతి అనేక సినిమాల్లో నటించారు, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ బాషల్లో 500కు పైగా సినిమాల్లో నటించారు.
Recommended Video

తెలుగు ప్రముఖల సంతాపం
ప్రముఖ నటి జయంతి సోమవారం ఉదయం బెంగళూరులోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. బెంగళూరు తెలుగు సంఘాలతో జయంతికి విడదీయరాని అనుభందం ఉంది. బెంగళూరులోని తెలుగు ప్రముఖలు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారు జయంతి ఇంటి దగ్గరకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.












Click it and Unblock the Notifications