బాలనటికి లైంగిక వేధింపులు: డైరెక్టర్ అరెస్ట్
న్యూఢిల్లీ: యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రవీందర్(47)ను లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రవీందర్ అనే వ్యక్తి లజపత్‌నగర్‌లో నట శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
ఇతని యూనిట్‌లో ఓ బాలిక కూడా సభ్యురాలిగా ఉంది. గడిచిన నెలలో షూటింగ్ నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బెరీ ప్రాంతానికి వెళ్లారు. షూటింగ్ ప్రాంతంలోనే బాలిక శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు రవీందర్.

అతని చర్యలను ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా యూనిట్‌ను నుంచి తొలగిస్తానని బెదిరింపులకు గురిచేశాడు.
శిక్షణ పేరుతో, డాక్యూమెంటరీల్లో, యాడ్ ఫిల్మ్స్‌లో అవకాశాలంటూ, అదేవిధంగా సెక్స్ విషయంలో సహకరిస్తే బాలీవుడ్ సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పేవాడని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.
బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితుడు పరారయ్యాడు. బుధవారం ఢిల్లీకి చేరుకున్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు, నిందితుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications