ముస్లిం అన్న కారణంగా జాబ్ నిరాకరణ: అదానీ కంపెనీలో ఉద్యోగం
ముంబై: ముస్లిం మతానికి చెందిన వాడని ముంబైలోని ఓ వజ్రాల ఎగుమతి చేసే కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతం మనకందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఆ యువకుడికి అహ్మదాబాద్ కు చెందిన అదానీ గ్రూప్ మంచి వేతనంతో కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని స్వయంగా జేషన్ అలీఖాన్ వెల్లడించాడు. ఇటీవల తాను పలు ఇంటర్యూలకు హాజరయ్యానని, ఆదానీ కంపెనీకు ఎంపికైనట్లు తెలిపాడు. ఇక, అదానీ గ్రూపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ తాము టాలెంట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని, తెగలు, కులాలు, మతాలకు కాదని తెలిపారు.
ఇటీవల జేషన్ అలీఖాన్ అనే యువకుడికి ముంబైలోని హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. ఈ వివాదం అనంతరం జేషన్ అలీఖాన్‌కు పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి. అయితే తాను ఆదానీ కంపెనీకు ఎంపికైనట్లు తెలిపాడు.

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హరికృష్ణ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంబీఏ పూర్తి చేసిన జేషన్ అలీఖాన్ అనే యువకుడు దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అతడికి ఆ కంపెనీ నుంచి వచ్చిన ఈమెయిల్ షాక్‌కు గురిచేసింది. 'నీవు ముస్లిం అయినందువల్ల ఉద్యోగాన్నిఇవ్వలేకపోతున్నామంటూ' ఈమెయిల్ సారాంశం.
దీంతో అవాక్కయిన జేషన్ అలీఖాన్ ఉద్యోగానికి సరిపడే విద్యార్హతలు లేకపోతే తనకు చెప్పాల్సిందంటూ.. ఈవిషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన సంస్ధ తాము అలాంటి వివక్ష చూపలేదంటూ మెయిల్ పంపింది. ట్రయినీ టైపింగ్‌లో పొరపాటు జరగడం వల్లే తప్పిదం జరిగిందని సంజాయిషీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications