ఇంట్లోనే ఆంటీతో నా మొగుడి రాసలీలలు, పొలిటికల్ లీడర్ మీద కేసు పెట్టిన భార్య, రూ. కోట్ల ఆస్తి స్వాహా !

చెన్నై/ వాణియంబాడి: ఆంటీ వ్యామోహంలో పడి నా భర్త తన జీవితాన్ని నాశనం చేశాడని, తన ఆస్తిని ప్రియురాలికి ఇచ్చాడని డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి మీద ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం బయట వేరే మహిళతో అక్రమ సంబంధం సాగించిన తన భర్త చివరికి ఆమెను ఇంటికే తీసుకు వచ్చి కాపురం పెట్టాడని ఆ పొలిటికల్ లీడర్ భార్య ఆరోపించారు. తన భర్త కంటే ఆమెకు 15 ఏళ్ల వయసు ఎక్కువని, తనకు న్యాయం చెయ్యాలని పోలిటికల్ లీడర్ భార్య సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

డీఎంకే నాయకుడు

డీఎంకే నాయకుడు

చెన్నైలోని అడయూరు ఇందిరా నగర్ లో నివాసి రమ్యకు వాణియంబాడికి చెందిన సారథి కుమార్ కు 2016లో వివాహం అయ్యింది. వడియంబాడి నగర డీఎంకే కార్యదర్శిగా సారథి కుమార్ పని చేస్తున్నాడు. సారథి కుమార్ కు రాజకీయంగా, పేరు పొందిన నాయకులు, ప్రముఖుల దగ్గర మంచి పలుకుడి ఉందని సమాచారం.

సేలం ఆంటీ మోజులో !

సేలం ఆంటీ మోజులో !

తమిళనాడులోని సేలంకు చెందిన ఆంటీతో తన భర్త సారథి కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రమ్య ఆరోపిస్తున్నారు. తన భర్త సారథి కుమార్ కంటే ఆమెకు 15 ఏళ్లు వయసు ఎక్కువని, అయినా ఆమె మోజులో పడిపోయాడని ఆయన భార్య రమ్య ఆరోపిస్తున్నారు.

నా తండ్రి ఆస్తులు నాశనం

నా తండ్రి ఆస్తులు నాశనం

సేలం ఆంటీ మోజులో పడిపోయిన తన భర్త సారథి కుమార్ తన 140 సవర్ల బంగారు నగలు తీసుకెళ్లి కుదవపెట్టాడని రమ్య చెప్పింది. నగలు కుదువ పెట్టగా వచ్చిన నగదు తీసుకెళ్లి అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళకు ఇచ్చాడని రమ్య ఆరోపించారు. అంతే కాకుండా తన తండ్రికి చెందిన ఆస్తులు అమ్మి ఆంటీకి తగలబెట్టాడని రమ్య వాపోయింది.

బెదిరించి రూ. 20 లక్షలు

బెదిరించి రూ. 20 లక్షలు

తన భర్త సారథి కుమార్ నా బంగారు నగలు కుదువ పెట్టి ఆ డబ్బు ఆంటీకి ఇచ్చాడని, తన తండ్రి ఆస్తులు అమ్మి ఆ డబ్బులు ఆమెకే ఇచ్చాడని రమ్య ఆరోపించింది. ఏమిటని ప్రశ్నిస్తే నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ తన భర్ద సారథి కుమార్ బెదిరించాడని, ఎక్కడ పరువు పోతుందో అంటూ ఇంత కాలం మౌనంగా ఉన్నానని రమ్య ఆరోపించారు.

నా ఇంట్లోనే ఆంటీతో రాసలీలలు

నా ఇంట్లోనే ఆంటీతో రాసలీలలు

ఇంత కాలం తాను ఓపిగా ఉన్నానని, అయితే తన భర్త సారథి కుమార్ చివరికి సేలం ఆంటీని ఇంటికే తీసుకొచ్చి ఆమెతో రాసలీలలు సాగిస్తున్నాడని రమ్య చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తన భర్త సారథి కుమార్ కు ఆమె తల్లి (రమ్య అత్త) పూర్తి మద్దతు ఇస్తున్నారని, తనకు చిత్రహింసలు పెడుతున్నారని రమ్య చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తామని !

గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తామని !

తన భర్త సారథి కుమార్ మీద ఈనెల 19వ తేదీన అరివాలయం పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేశానని రమ్య గుర్తు చేశారు. తరువాత ఇంటికి వస్తున్న తనను మార్గం మధ్యలో అడ్డగించిన తన భర్త సారథి కుమార్ మెడ మీద కత్తిపెట్టి కేసు వెనక్కి తీసుకోకుంటే నిన్ను చంపేస్తానని బెదిరించాడని, తనకు ప్రాణహాని ఉందని, మీరే నాకు న్యాయం చెయ్యాలని రమ్య చెన్నై సిటీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సారథి కుమార్ మీద కేసు నమోదు చేసి విచారణ చెయ్యాలని చెన్నై సిటీ పోలీసు కమిషనర్ స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+