వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత‌ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ వ్యాఖ్య‌లతో సోనియా..రాహుల్ షాక్‌:స‌భా సాక్షిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో:బీజేపీ

|
Google Oneindia TeluguNews

అస‌లే అధినేత ఎవ‌రూ లేక ఇబ్బంది ప‌డుతున్న కాంగ్రెస్‌. కావాల్సిన మెజార్టీ కంటే ఎక్కువ ద‌క్కించుకొన్ని జోష్‌లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మీద బౌన్స‌ర్లు వేస్తోంది. ఇప్పుడు ఆక‌స్మికంగా తీసుకొచ్చిన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు.. జ‌మ్ము కాశ్మీర్ పున‌ర్విభ‌జ‌న బిల్లుతో కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేయ‌లేదు. రాజ్య‌స‌భ‌లో పార్టీ నేత‌లు అజాదా్.. చిదం బ‌రం కేంద్రం పైన ఫైర్ అయ్యారు. లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ అధీర్ రంజ‌న్ చౌదురి చేసిన వ్యాఖ్య‌ల‌తో ఏకంగా సోనియా..రాహుల్ బిత్త‌ర పోయారు. ఏంటీ వ్యాఖ్య‌లు అంటూ విస్తుపోయారు. అంతే ఇదే అవ‌కాశాన్ని అమిత్ షా అంది పుచ్చుకున్నారు. ఆ వ్యాఖ్య‌ల మీద కాంగ్రెస్‌ను ఆడుకున్నారు. కాంగ్రెస్ పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది.

కాంగ్రెస్ నేత విప‌రీత వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్ నేత విప‌రీత వ్యాఖ్య‌లు..

కాశ్మీర్ వ్య‌వ‌హారం పైన హోం మంత్రి అమిత్ షా బిల్లు లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ అధీర్ రంజ‌న్ చౌదురి స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌ట్టారు. రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ సాగిన వేళ పార్టీ నేత‌లు అజాద్..చిదంబ‌రం కేంద్రం నిర్ణ‌యాన్ని త‌ప్పు బడుతూనే పార్టీ విధానం స్ప‌ష్టం చేసారు. అయితే, లోక్ స‌భ లో మాత్రం ఆ పార్టీ నేత అధీర్ రంజ‌న్ చౌదురి త‌న ప్ర‌సంగంలో జ‌మ్ము కాశ్మీర్ అంశం ద్వైపాక్షిక‌మ‌ని.. అంత‌ర్జాతీ య అంశ‌మ‌ని వ్యాఖ్యానించారు. కేంద్రం అంత‌ర్గ‌త స‌మ‌స్య అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చేసిన కామంట్ తో అక్క‌డే స‌భ‌లో ఉన్న సోనియా గాంధీ..రాహుల్ గాంధీతో స‌హా పార్టీ నేత‌లంగా షాక్‌కు గుర‌య్యారు. ఆ వెంట‌నే సోనియా గాంధీ రంజ‌న్ చౌధురికి చీవాట్లు పెట్టారు. స‌భా సాక్షిగా పార్టీ ప‌రువు తీసారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. స‌రిగ్గా దీనినే బీజేపీ అందిపుచ్చుకుంది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మా..లేక కాంగ్రెస్ పార్టీ విధాన‌మా స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇక‌, రాహుల్ గాంధీ ట్వీట్ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం మీద అసంతృప్తి వ్య‌క్తం చేసారు.

కాంగ్రెస్‌కు షాకులు మీద షాకులు..

కాంగ్రెస్‌కు షాకులు మీద షాకులు..

జ‌మ్ము కాశ్మీర్ విష‌యంలో నెహ్రూ చేసిన త‌ప్పు కార‌ణంగానే ఇప్ప‌టి వ‌ర‌కు ఇబ్బందులు వ‌చ్చాయ‌ని ప‌దే ప‌దే బీజేపీ నేత‌లు ఆరోపిస్తుంటే స‌భ‌లోనే ఉన్నా..కాంగ్రెస్ నేత‌లు తిప్పి కొట్ట‌టం లో విఫ‌ల‌మ‌య్యారు. బీజేపీ స‌మయం చూసి కాంగ్రెస్ మీద బౌన్స‌ర్ల‌ను సంధించింది. కాశ్మీర్ అంశం..పీఓకే ప్ర‌స్తావ‌న ద్వారా తాము దేశం కోసం నిల‌బ‌డ్డామ‌ని స‌భ లో హోం మంత్రి అమిత్ షా ప‌దే ప‌దే చెబుతుంటే..కాంగ్రెస్ నేత‌లు మాత్రం త‌మ విధానం ఏంట‌నేది స్ప‌ష్టంగా చెప్ప లేక‌పోయారు. మ‌నీష్ తివారి కేంద్ర ప్ర‌భుత్వ తీరును త‌ప్పు బ‌డుతూ మాట్లాడినా.. మిగిలిన నేత‌లు మాత్రం నిర్ధిష్టంగా త‌మ అభిప్రాయం చెప్ప‌లేక పోయారు. రాజ్య‌స‌భ‌లో ఇప్ప‌టికే కాంగ్రెస్ విప్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. కేంద్రం ప్ర‌తిపాదించిన బిల్లు వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ పార్టీ తీరుకు నిర‌స‌న‌గా రాజీనామా ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బాధ్య‌త‌లు తీసుకొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.

వ‌ర్కింగ్ క‌మిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశం..

వ‌ర్కింగ్ క‌మిటీ అత్య‌వ‌స‌ర స‌మావేశం..

బీజేపీ తాజాగా తీసుకున్న నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో త‌మ వాద‌న పేల‌వంగా ఉండ‌టంతో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ పైన చ‌ర్చించేందుకు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం అవుతోంది. జ‌మ్ము కాశ్మీర్ రాష్ట్ర విభ‌జ‌న‌.. కొద్ది రోజులుగా పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. భ‌విష్య‌త్ నిర్ణ‌యాల పైన చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఒక ర‌కంగా ఇప్పుడు లోక‌స‌భ‌లో సొంత పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక ర‌కంగా కాంగ్రెస్ పార్టీ ఇత‌రుల‌క మ‌ద్ద‌తు ఇచ్చేలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం క‌లిగించేందుకు బీజేపీ అవ కాశంగా మ‌ల‌చుకుంటోంది. దీంతో..కాంగ్రెస్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల పైన దృష్టి పెట్టింది.

English summary
Congress floor leader Adhir Ranjan Chowdary comments in debate of Kashmir issue became controversy. Sonia and Rahul shock over his argument in Loksabha. Sonia serious on his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X