రాహుల్‌గాంధీ వివాహం: నాకు సోదరుడు: ఆదితి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో పెళ్ళి చేసుకొనే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితీసింగ్ ను రాహుల్ పెళ్ళి చేసుకొంటారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆదితి సింగ్ కొట్టిపారేశారు. ఈ వార్తలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె చెప్పారు. రాహుల్ గాందీ తనకు సోదరుడని అదితిసింగ్ ఆదివారం నాడు తేల్చి చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్ కు త్వరలో వివాహం కాబోతోందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది.ఈ ప్రచారం పట్ల ఆదితిసింగ్ స్పందించారు. ఈ ప్రచారం తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని ఆమె తప్పుబట్టారు. రాయ్ బరేలీ నుండి వాట్సాప్ వేదికగా ఈ ప్రచారం ప్రారంభమైందని గుర్తించారు.

రాహుల్ నాకు పెద్దన్నయ్యతో సమానం. ఆయన నాకు రాఖీ బ్రదర్. సామాజిక మాధ్యమాల్లో సంచలనం అవుతోన్న ఈ వార్తలను విని ఎంతగానో బాధపడ్డాను. ఇప్పటికైనా వీటికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నానని ఆదితి సింగ్ స్పష్టం చేశారు.
ఈ వదంతులు రాయ్‌బరేలీకి చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించినట్లు తేలింది. రాహుల్-అదితీ ఫొటోలను కలిపి ఉంచి వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్ ద్వారా స్నేహితులకు సందేశాలు పంపారు.
అదితీ గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై 90,000 పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విదేశాల్లో మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చదివి భారత్ తిరిగొచ్చిన అనంతరం అదితీ సింగ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతేకాదు రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు అదితి అత్యంత సన్నిహితురాలు.












Click it and Unblock the Notifications