భూమండలానికి అవతలి వైపు
బెంగళూరు: సూర్యుడిపై సరికొత్త ప్రయోగాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1పై ప్రయాణానికి సంబంధించిన మరో తాజా సమాచారం వెలువడింది. ప్రస్తుతం భూ కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మార్చారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం అనంతరం దాని భూకక్ష్యను మార్చడం ఇది అయిదోసారి.
అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటలకు ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో ఈ శాటిలైట్ కక్ష్యను మార్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని, ప్రయాణం సజావుగా సాగుతోందని తెలిపారు. 110 రోజుల తరువాత ఆదిత్య ఎల్1ను మరోసారి మండించడం ద్వారా దాన్ని లాగ్రాంజ్ పాయింట్ 1లో ఇంజెక్ట్ చేస్తారు.

అదే చివరిది అవుతుంది. ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ పరిభ్రమిస్తూ.. క్రమంగా తన కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి దిశగా దూసుకెళ్తోంది. ఈ ఉపగ్రహం భూకక్ష్యలోనే ఇంకో 16 రోజుల పాటు సంచరిస్తుంది. లాగ్రాంజ్ పాయింట్ 1లో ప్రవేశపెట్టడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కనీసం అయిదుసార్లు ఈ శాటిలైట్ కక్ష్యను మార్చాల్సి ఉంటుంది.
తాజాగా ఆదిత్య ఎల్1 ఎర్త్ బౌండ్ ఫైరింగ్‌తో ఈ ప్రక్రియ పూర్తయినట్టే. 110 రోజుల తరువాత మరోసారి దాన్ని మండిస్తారు. ప్రయోగించిన 125 రోజుల తరువాత ఈ ఉపగ్రహం లాగ్రాంజ్ పాయింట్1లో ప్రవేశిస్తుంది. ఇప్పటివరకు నాలుగుసార్లు దాని కక్ష్యను బదలాయించారు. 3, 5, 10, 15 తేదీల్లో అవి విజయవంతంగా ముగిశాయి.
బెంగళూరు, మారిషస్, శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌లు ఉపగ్రహాన్ని విజయవంతంగా ట్రాక్ చేస్తోన్నాయి. ఈ స్టేషన్‌లతో ఆదిత్య-L1 కోసం ఫిజీ ఐలండ్స్‌లో గల పోస్ట్-బర్న్ టెర్మినల్ నుంచీ ఆపరేషన్‌లను నిర్వహిస్తోన్నట్లు ఇస్రో తెలిపింది. 125 రోజుల ప్రయాణం తరువాత ఎల్1 పాయింట్‌కు చేరుకుంటుంది. అప్పటినుంచి సూర్యుడిపై అధ్యయనం చేయడం మొదలుపెడుతుంది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications