Aditya L1 Mission: నింగిలోకి ఆదిత్య ఎల్-1

శ్రీహరికోట: చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 విజయవంతమై పట్టుమని పదిరోజులు కూడా కాకముందే ఈ సారి సూర్యుడి గురించి పరిశోధన చేసేందుకు మిషన్‌ను సిద్ధం చేసింది. ఈ మిషన్ పేరు ఆదిత్య -ఎల్ 1 (Aditya L1).

ఆదిత్య ఎల్-1 మిషన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్‌వీసీ 57 రాకెట్ ఈ మిషన్‌ను నింగిలోకి మోసుకెళుతుంది. అంతరిక్షపు వాతావరణంలో సూర్యుడి పాత్ర ఎలా ఉంది అనేదానిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో ఈ మిషన్‌ను ప్రయోగిస్తోంది. 2 సెప్టెంబర్ 2023 శనివారం 11 గంటల 55 నిమిషాలకు ఆదిత్య ఎల్-1 మిషన్ ఏపీలోని శ్రీహరికోట నుంచి టేకాఫ్ అవుతుంది. భూమి నుంచి నింగిలోకి 1.5 మిలియన్ కిలోమీటర్లు మేరా ప్రయాణించి లాగ్‌రేంజియన్ పాయింట్ (L1)వద్ద కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇక అక్కడి నుంచి సూర్యడిని స్టడీ చేస్తుంది. ఆదిత్య ఎల్ 1 మిషన్‌కు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Aditya L1 Mission, ISRO’s Solar Mission Launch LIVE Updates in Telugu

Sep 02, 2023, 1:06 pm IST

శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్‌-1తో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ బయల్దేరిన సమయంలో జనం 'భారత్‌ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.
Sep 02, 2023, 12:37 pm IST

ఆదిత్య-ఎల్1 సూర్యుడిపై సమగ్ర అధ్యయం చేయనుంది. దీనిలో ఏడు విభిన్న పేలోడ్‌లు ఉన్నాయి. ఇస్రో ద్వారా ఐదు, ఇస్రో సహకారంతో విద్యాసంస్థల ద్వారా రెండు దేశీయంగా అభివృద్ధి చేసిన పేలోడ్ లు ఉన్నాయి.
Sep 02, 2023, 12:18 pm IST

ఆదిత్య-L1 వ్యోమనౌక సౌర కార్యకలాపాలను అధ్యయనం చేయనుంది.
Sep 02, 2023, 12:10 pm IST

ఆదిత్య L1 వ్యోమనౌకను కప్పి ఉంచే పేలోడ్ వేరు అయింది.
Sep 02, 2023, 11:50 am IST

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1.
Sep 02, 2023, 11:26 am IST

కాసేపట్లో ఆదిత్య ఎల్-1 ప్రయోగం.
Sep 02, 2023, 11:05 am IST

భారతదేశపు మొట్టమొదటి సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య-ఎల్1 మోసుకెళ్లే PSLV-C57 ప్రయోగానికి 1 గంట 47 నిమిషాలు మిగిలి ఉండగా, కౌంట్ డౌన్ కొనసాగుతోంది.
Sep 02, 2023, 10:35 am IST

సంస్కృతంలో ఆదిత్య అంటే సూర్యుడు. ఆదిత్య L1 అనేది సూర్యునిపై అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్.
Sep 02, 2023, 10:17 am IST

ఆదిత్య-L1 మిషన్‌తో అన్నీ సరిగ్గా జరిగితే, ఇది సూర్యునిపై అధ్యయనం చేయనుంది.
Sep 02, 2023, 9:47 am IST

ఈ రోజు భారత అంతరిక్ష చరిత్రలో ముఖ్యమైన రోజు. సూర్యుడిని స్టడీ చేసేందుకు ఆదిత్య ఎల్ 1 సిద్ధమైంది. సూర్యుడి కరోనా గురించి స్టడీ చేయడం అంత సులభం కాదు. సంపూర్ణ సూర్యగ్రహణం రోజు మాత్రమే కరోనా గురించి స్టడీ చేయడం సాధ్యపడుతుంది- వ్యోమగామి, ప్రొఫెసర్ ఆర్సీ కపూర్
Sep 02, 2023, 9:05 am IST

ఆదిత్య ఎల్ 1 ప్రయోగంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు చెన్నై నుంచి శ్రీహరికోటకు వచ్చామని చెప్పిన బామ అనే మహిళ. భారతీయురాలిగా తాను ఎంతో గర్వపడుతున్నట్లు అదే సమయంలో సంతోషంగా ఉందంటూ చెప్పిన బామ
Sep 02, 2023, 9:03 am IST

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ నుంచి విడుదలైన విజువల్స్
Sep 02, 2023, 9:01 am IST

ఆదిత్య ఎల్ 1 సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. L1 పాయింట్ వద్ద కక్ష్యను సృష్టించి అక్కడే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన విషయాలను కరెక్ట్‌గా స్టడీ చేయడం చాలా కష్టం. సైంటిస్టులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. 7 పేలోడ్లు వివిధ రకాలుగా పనిచేస్తాయి- ఇస్రో సైంటిస్ట్ మైల్‌స్వామి అన్నాదురై
Sep 02, 2023, 8:12 am IST

హైదరాబాదులోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో ఆదిత్య ఎల్ 1 ప్రయోగం లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు
Sep 02, 2023, 8:11 am IST

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కోసం సర్వం సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగరనున్న ఆదిత్య ఎల్ 1
Sep 01, 2023, 6:22 pm IST

చంద్రయాన్ విజయవంతమైన కొన్ని రోజులకే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం
Sep 01, 2023, 6:21 pm IST

ఇప్పటికే ప్రారంభమైన కౌంటింగ్..శనివారం ఉదయం 11:55 నిమిషాలకు టేకాఫ్
Sep 01, 2023, 6:20 pm IST

మరికొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య ఎల్ 1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+