Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aditya L1 ప్రయాణంలో ట్రాజెక్టరీ కరెక్షన్స్

బెంగళూరు: సూర్యుడిపై సరికొత్త ప్రయోగాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1పై ప్రయాణానికి సంబంధించిన మరో తాజా సమాచారం వెలువడింది. ఇదివరకే భూ కక్ష్యను దాటుకున్న ఈ శాటిలైట్ ఆదిత్యుడి వైపు దూసుకెళ్తోంది.

ఇంకో రెండు నెలల వ్యవధిలో ఆదిత్య ఎల్1 శాటిలైట్.. తన నిర్దేశిత గమ్యానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 ప్రయాణం సజావుగా సాగుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. ప్రయోగించిన తేదీ నుంచి 125 రోజుల తరువాత ఇది- ట్రాన్స్ లాగ్రాంజియన్ పాయింట్ 1కు చేరుకోవాల్సి ఉంది.

Aditya L1 Mission: Trajectory Correction Maneuvre was performed by isro

ఇదివరకు అయిదుసార్లు ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో ఈ శాటిలైట్ క‌క్ష్య‌ను మార్చారు శాస్త్రవేత్తలు. 110 రోజుల తరువాత ఆదిత్య ఎల్1ను మరోసారి మండించడం ద్వారా దాన్ని లాగ్రాంజ్ పాయింట్ 1లో ఇంజెక్ట్ చేస్తారు. అదే చివరిదవుతుంది. ఇప్పటివరకు అయిదుసార్లు దాని కక్ష్యను బదలాయించారు. సెప్టెంబర్ 3, 5, 10, 15, 19 తేదీల్లో అవి విజయవంతంగా ముగిశాయి.

బెంగళూరు, మారిషస్, శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌లు ఉపగ్రహాన్ని విజయవంతంగా ట్రాక్ చేస్తోన్నాయి. ఈ స్టేషన్‌లతో ఆదిత్య-L1 కోసం ఫిజీ ఐలండ్స్‌లో గల పోస్ట్-బర్న్ టెర్మినల్ నుంచీ ఆపరేషన్‌లను నిర్వహిస్తోన్నట్లు ఇస్రో తెలిపింది. 125 రోజుల ప్రయాణం తరువాత ఎల్‌1 పాయింట్‌కు చేరుకుంటుంది. అప్పటినుంచి సూర్యుడిపై అధ్య‌య‌నం చేయడం మొదలుపెడుతుంది.

Aditya L1 Mission: Trajectory Correction Maneuvre was performed by isro

ఇవ్వాళ ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్యువర్‌ను చేపట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి కరెక్షన్ చేయడం ఇది తొలిసారి. ఈ నెల 6వ తేదీన 16 సెకన్ల పాటు ట్రాజెక్టరీ కరెక్షన్స్ నిర్వహించినట్లు ట్వీట్ చేశారు. సెప్టెంబరు 19వ తేదీన చివరిసారిగా ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మాన్యువర్‌ను పూర్తి చేసిన తరువాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని తెలిపారు.

ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు చెప్పారు. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడం వల్ల ఆదిత్య ఎల్1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో సాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని తెలిపారు. ఇంకొన్ని రోజుల్లో మాగ్నెటో మీటర్ మళ్లీ ఆన్ చేస్తామని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+