Aditya-L1: మరో కీలక ప్రక్రియను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1, మళ్లీ సెప్టెంబర్ 10
బెంగళూరు: సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) ఉపగ్రహాన్ని నిర్దేశిత భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో(ISRO) మరో కీలక ముందడుగు వేసింది. రెండోసారి ఆదిత్య-ఎల్1 కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం 282x40225 కి.మీ కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించినట్లు తెలిపింది.
బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్-ISTRAC) నుంచి ఈ విన్యాసం చేసినట్లు ట్వీట్ చేసింది. ఆ సమయంలో ఉపగ్రహాన్ని మారిషస్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ల నుంచి ట్రాక్ చేసినట్లు వెల్లడించింది. ఆదివారం(సెప్టెంబర్ 3న) తొలి కక్ష్య పెంపు ప్రక్రియను నిర్వహించిన విషయం తెలిసిందే. తదుపరి ప్రక్రియ సెప్టెంబర్ 10 వేకువజామున 2.30 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కాగా, 'ఆదిత్య-ఎల్1' ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం (2023 సెప్టెంబర్ 2) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశించింది. 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది 'ఆదిత్య-ఎల్1' వ్యోమనౌక. అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు (lagrange point 1) దిశగా.. 125 రోజుల ప్రయాణం తర్వాత చేరుకోనుంది.
లగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. ఫలితంగా అక్కడ ఎక్కువ కాలం సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలు ఉంటుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం ఉంటుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపట్టింది.
ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను నింగిలోకి మోసుకెళ్లింది. ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు ఉన్నాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications