అమ్మది రజనీ కాంత్ స్టైల్, శశికళది కమల్ హాసన్ స్టైల్: అన్నాడీఎంకే

అన్నాడీఎంకే చీఫ్ గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ లో కార్యకర్తలను ముందుకు నడిపించారని, ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జాతీయ ఉత్తమ నటుడు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శైలికి, ప్రస్తుత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ శైలికి చాల ప్రత్యేకత ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నజింల్ సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

షాక్: సంక్రాంతికి శశికళ దిమ్మ తిరిగింది: పార్టీలో తిరుగుబాటు !

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అచ్చం జయలలిత లాగా శశికళ నాటరాజన్ తయారు అవుతున్నారని, ఆమె చీరకట్టు, హావభావాలు అన్ని అమ్మను అనుసరిస్తున్నారు కదా ? అని మీడియా ప్రశ్నించగా నంజిల్ సంపత్ తనదైన శైలిలో స్పందించారు.

ADMK's Nanjil Sampath said that Jayalalithaa's lead in ADMK is like Rajinikanth Style; and Sasikala's lead is like Kamal Haasan style.

అన్నాడీఎంకే చీఫ్ గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ లో కార్యకర్తలను ముందుకు నడిపించారని, ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జాతీయ ఉత్తమ నటుడు కమలహాసన్ శైలిలో వ్యవహరిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పారు.

జయ మృతి: సీబీఐ నుంచి శశికళ తప్పించుకోలేరు ! ఎంపీ

రజనీకాంత్ కు, కమలహాసన్ శైలికి ఎంత వ్యత్యాసం ఉందో జయలలిత, శశికళకు అంతే వ్యత్యాసం ఉందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నంజిల్ సంపత్ చెప్పారు. అంటే ఏమిటీ మీ ఉద్దేశం అని మీడియా ప్రశ్నిస్తే ఆ విషయం మీరే అలోచించుకోండి అంటు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నంజిల్ సంపత్ మాటలు సామాన్యంగా ఎవ్వరికీ అర్థం కావని, ఆయన మాటతీరే అలా ఉంటుందని పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద మాటల తూటాలతో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకునే నంజిల్ సంపత్ ఇప్పుడు జయలలిత, శశికళను ఇద్దరు విలక్షణ నటులతో పోల్చి చెప్పడం పార్టీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+