Viral video: ఈ తెల్ల పులికూనలు ఎంత ముద్దొస్తున్నాయో చూడండి..!
భిలాయ్: దేశంలో పెద్ద పులుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జంతుసంరక్షణ చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా వాటిని పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పలు జాతులకు చెందిన జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇక దేశంలో పలు అభయారణ్యాల్లో నివాసం ఉంటోన్న పెద్ద పులులు సంఖ్య కూడా తగ్గిపోతోంది. కొన్ని అనారోగ్యంతో మృతి చెందుతుంటే మరికొన్ని జనావాసాల్లోకి వచ్చి బలవుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న మైత్రీ బాగ్ జూ పార్కులో రక్ష అనే ఓ తెల్ల ఆడపులి మూడు పులికూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జూ అధికారులు తెలిపారు. నెలన్నర రోజుల క్రితమే ఈ పెద్ద పులి..పిల్లల్ని కనగా తాజాగా వాటికి సంబంధించిన వీడియోను జూ అధికారులు విడుదల చేశారు.

ఈ పులికూనల వయస్సు 45 రోజులు. రక్ష- సుల్తాన్ అనే రెండు పులులు ఈ పులికూనలను కన్నట్లు జూ అధికారులు తెలిపారు. 1997లో ఈ రెండు పెద్ద పులులను నందకానన్ జూలాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చినట్లు మైత్రీ బాగ్ జూపార్క్ ఇంఛార్జ్ ఎన్‌కే జైన్ తెలిపారు. అంతకుముందు కూడా ఇవి పిల్లల్ను కన్నట్లు వివరించారు. ఇందులో డజను పులులను దేశంలోని ఇతర జూపార్కులకు తరలించినట్లు చెప్పుకొచ్చారు.
#WATCH | Chhattisgarh | A white tigress, Raksha gave birth to three cubs around 1.5 months back at Maitri Bagh Zoo in Bhilai. The Zoo Authority released the first visuals of the cubs on 12th June.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023
(Video: Maitri Bagh Zoo) pic.twitter.com/KfOzLa457g
గతేడాది నవంబర్‌లో సింఘం అనే రెండు నెలల వయసున్న పులికూనను మైత్రీ బాగ్ జూలో విడిచిపెట్టారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పులుల మధ్య సంభోగ ప్రక్రియను నిలిపివేసినట్లు జూ అధికారులు వెల్లడించారు. కొన్నినెలల క్రితమే ఓ ఆడపులి(రోమా) మరో మగపులిని (సుల్తాన్) జూపార్కుకు తీసుకురాగా ఆరెండు సింఘం అనే పులికూనకు జన్మనిచ్చినట్లు జైన్ వివరించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications