ప్రధాని అయ్యాక మోదీ ఆస్తులు పెరిగింది ఎంత, రాహుల్ లెక్క ఇలా - బిగ్ రిపోర్ట్..!!
ప్రధాని మోదీ ఆస్తుల విలువ ఎంత. ప్రధాని అయ్యాక ఏ మేర పెరిగాయి. విపక్ష నేత రాహుల్ గాంధీ కి ఆస్తులు ఎంత ఉన్నాయి. వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచిన నేతలు ఏ మేర ఆస్తులను పెంచుకున్నారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారు. ఇలాంటి పూర్తి సమాచారం తో అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) కీలక నివేదిక బయట పెట్టింది. అయితే, ఈ లెక్కల్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ తో పాటుగా పలువురు ముఖ్య నేతల లెక్కలను వెల్లడించారు.
2014 నుంచి 2024 వరకు మూడు సార్లు ఎంపీగా గెలిచిన నేతల ఆస్తుల లెక్కలను ఏడీఆర్ బయట పెట్టింది. తాజా నివేదిక లో పలు కీలక అంశాలను వెల్లడించింది. యూపీలోని వారణాసి నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు రూ.3,02,06,889గా తేలింది. 2014లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లుగా ప్రకటించారు. పదేళ్లలో మోదీ ఆస్తుల విలువ సుమారు రూ.1.36కోట్లు పెరిగింది. అంటే 82శాతం పెరిగిందని ఏడీఆర్ సంస్థ విశ్లేషించింది. అదే విధంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు దాదాపు రూ.11కోట్లు (117శాతం) పెరిగాయి. ఎంపీల జాబితాలో ఆయన 38వ స్థానంలో ఉన్నారు. 2014లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా బరిలోకి దిగినప్పుడు రాహుల్ గాంధీ ఆస్తుల విలువ రూ.9.40 కోట్లు కాగా, 2024లో అమేథి నుంచి పోటీకి దిగినప్పుడు రూ.20.39 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు.

ఇక.. ప్రతాప్ సిన్హా మహరాజ్ ఆస్తి 2014లో రూ.60.60కోట్లు కాగా.. 2024నాటి అఫిడవిట్‌లో తన ఆస్తిని రూ.223.12 కోట్లుగా చూపించారు. రెండో స్థానంలో గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్ బీజేపీ ఎంపీ పూనంబెన్ హేమంత్ భాయ్ ఉన్నారు. 2014లో ఆమె ఆస్తి రూ.17.42 కోట్లు కాగా.. 2024నాటి అఫిడవిట్‌లో రూ.147.70 కోట్లుగా పేర్కొన్నారు. పదేళ్లలో ఆమె ఆస్తుల విలువ రూ.130 కోట్లు పెరిగింది. మూడో స్థానంలో ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిలిచారు. 2014 అఫిడవిట్‌లో ఆయన ఆస్తి విలువ రూ.22 కోట్లుగా పేర్కొన్నారు. 2024లో రూ.146కోట్లుగా చూపించారు. పదేళ్లలో మిథున్ రెడ్డి రూ.124కోట్లు పెరిగాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఆస్తులు పదేండ్లలో రూ.19కోట్లు పెరిగాయి. టీడీపీ తరపున గత మూడు ఎన్నిలక్లో గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తులు పదేళ్లలో 117శాతం పెరిగినట్లు వివరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications