అద్వానీ జీ..దయచేసి మీరు రామమందిరానికి రావొద్దు: ఆహ్వానితుల జాబితాలో రజినీకాంత్, మాధురి దీక్షిత్
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవానికి ఎంతో సమయం లేదు. కొత్త సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. మూడు రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది.

అయోధ్య సూర్యస్తంభాన్ని నిర్మించారు. అయోధ్యలోని ధర్మపథ్ మార్గంలో దీన్ని నెలకొల్పారు. దీని ఎత్తు సుమారు 20 అడుగులు. పైభాగంలో సూర్యుడి ప్రతిబింబాన్ని అమర్చారు. స్తంభంపై జై శ్రీరామ్ అనే అక్షరాలను హిందీలో ముద్రించారు. హనుమంతుడు, గద, ఇతర రామాయణ ఘట్టాలను దీనిపై చిత్రీకరించారు.
కాగా- రామాలయం గర్భగుడి ఫొటోలు ఇటీవలే విడుదల అయ్యాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. వాటిని విడుదల చేసింది. గర్భాలయ ఫొటోలు వెలుగులోకి రావడం అదే తొలిసారి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12:45 నిమిషాలకు గర్భాలయ పీఠంపై రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తామని పేర్కొంది.
తాజాగా ఈ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల పేర్లను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బౌద్ధమత గురువు దలైలామా, మాతా అమృతానందమాయీ, యోగా గురు బాబా రామ్‌దేవ్, ప్రముఖ నటులు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, అరుణ్ గోవిల్, దర్శకుడు మాధుర్ భండార్కర్.. ఈ జాబితాలో ఉన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబాని, అనిల్ అంబాని, ప్రఖ్యాత చిత్రకళాకారుడు వాసుదేవ్ కామత్, ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ పేర్లూ ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. రామమందిరం కోసం జీవితాంతం పోరాడిన మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ పేర్లు ఈ జాబితాలో లేవు.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావొద్దని ఎల్ కే అద్వాని, మురళీ మనోహర్ జోషీలకు విజ్ఞప్తి చేస్తోన్నామని చంపత్ రాయ్ తెలిపారు. వారి వయస్సు, ఇతరత్రా కారణాలను దృష్టిలో ఉంచుకుని వారిద్దరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించట్లేదని ఆయన తేల్చి చెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications