తాలిబన్ల సంచలనం భారత్‌తో కటీఫ్: ఢిల్లీలో..
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ల ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ రాజధానిలోని తమ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది. ఇతర నగరాల్లో ఉన్న హైకమిషనర్, కాన్సులేట్ కార్యాలయాను కూడా శాశ్వతంగా మూసివేస్తోన్నట్లు ప్రకటించింది.
ఈ పరిణామాలు కాస్త- భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెగదెంపులు చేసుకుందనే అనుమానాలకు దారి తీసినట్టయింది. భారత్‌లోని తమ రాయబార, దౌత్య కార్యాలయాలన్నింటినీ మూసి వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి గల అంతర్గత కారణాలు ఏమిటనేది పూర్తిగా తెలియ రాలేదు.

ఈ ఉదయం నుంచే ఢిల్లీలోని రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ నుంచి నిరంతరంగా తమకు సవాళ్లు ఎదురవుతున్నాయనే విషయాన్ని వారు ప్రధాన కారణంగా చూపించారు.
నిజానికి- సెప్టెంబర్ 30వ తేదీ నుంచే ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలవడించలేదు. భారత ప్రభుత్వ వైఖరి తమకు అనుకూలంగా మారుతుందనే ఆశతో ఎదురు చూశామని, అది నెరవేరలేదని వివరించింది.
భారత్‌లో నివసించే ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు పేర్కొంది. దౌత్య కార్యాలయం కొనసాగినన్ని రోజులూ ఆఫ్ఘన్ ప్రజలకు ఎప్పటికప్పుడు తమవంతు సహాయ, సహకారాలను అందజేస్తూ వచ్చామని, తమను ఆదరించిన భారత ప్రజలకూ కృతజ్ఞతలు తెలియజేస్తోన్నామని పేర్కొంది.












Click it and Unblock the Notifications