సూర్య సినిమా మాదిరి: కడుపులో కొకైన్‌‌తో ఆఫ్రికన్ అరెస్ట్

బెంగుళూరు: సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ఆఫ్రికన్ స్మగ్లర్‌ను మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్రెజిల్ నుంచి అబుదాబి వయా బెంగుళూరుకు చేరుకున్న నైజీరియాకు చెందిన వ్యక్తిని విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ముందస్తు సమాచారం ఉండటంతో బెంగుళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే కస్టమ్స్ అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పూర్తిగా చెక్ చేశారు. ఆ సమయంలో అతడి వద్ద నుంచి ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి అతడి శరీరం మొత్తాన్ని స్కాన్ చేశారు.

ఈ క్రమంలో అతని కడుపులో సుమారు రూ. 3 కోట్లు 20 లక్షల విలువైన 69 కొకైన్‌ క్యాప్సుల్స్‌ను కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. వెంటనే అతడిని హోసూరు రోడ్డులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడి కడుపులోని 69 క్యాప్సుల్స్‌ను బయకు తీసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

African man with drug worth Rs 3 crore held at Bangalore airport

అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో అతడు నైజీరియా దేశస్థుడిగా గుర్తించారు. అతని భార్య, పిల్లలిద్దరూ కూడా గత కొంతకాలంగా బెంగుళూరులోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమాను తలపిస్తోంది.

హీరో సూర్య, తమన్నా జంటగా నటించిన వీడొక్కడే సినిమాలో ఇదే మాదిరి డ్రగ్స్‌ను ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు సరఫరా చేస్తుంటారు. ఈరోజు బెంగుళూరు విమానాశ్రయంలో చోటు చేసుకున్న సంఘటన కూడా ఈ సినిమాలోని సన్నివేశాలను తలపించడం విమానాశ్రయ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+