హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎండీ ‘మే’తుఫాన్ అలర్ట్: గత కొన్నేళ్లుగా తుఫాన్ల బీభత్సం, ఈ ఏడాది కూడా, మేలోనే ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత రెండు సంవత్సరాలుగా మే నెలలోనూ భారీ తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఈ ఏడాది కూడా మరో తుఫాను ముప్పు పొంచివుంది. 2020లో అంఫన్ తుఫాను బీభత్సం సృష్టించగా.. 2021లో యాస్ తుఫాను కల్లోలం సృష్టించింది. తాజాగా, 2022 మే నెలలో కూడా బంగాళాఖాతంలో తుఫాను పొంచివుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

తీవ్ర తుఫానుగా మారే అవకాశం

తీవ్ర తుఫానుగా మారే అవకాశం


ఇప్పటికే సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. ఇది దక్షిణ అండమాన్ సముద్రంలో ఉంది. దీంతో నికోబార్ దీవులలో భారీ వర్షం కురిసింది. ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ వరుస ట్వీట్లలో గురువారం తెలిపింది.

తీవ్ర తుఫాను భారీ వర్షాలు: రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు

తీవ్ర తుఫాను భారీ వర్షాలు: రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు

రానున్న ఐదు రోజుల పాటు మత్స్యకారులు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య, బీహార్, జార్ఖండ్‌లలో ఉరుములుమెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒడిశా ఇప్పటికే తుఫాను హెచ్చరికలను జారీ చేసింది, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని కోస్తా జిల్లా యంత్రాంగాలను కోరింది.

గత మూడేళ్లుగా.. మేలోనే తీవ్ర తుఫానులు

గత మూడేళ్లుగా.. మేలోనే తీవ్ర తుఫానులు

గత కొన్నేళ్లుగా మే నెలలోనే బంగాళాఖాతంలో తీవ్ర తుఫానులు ఏర్పడుతున్నాయి. యాస్ తుఫాను 2021లో ఒడిశా తీరప్రాంతాన్ని తాకింది. గాలి వేగం గంటకు 155 కి.మీలతో బీభత్సం సృష్టించగా.. అంఫాన్ 2020లో పశ్చిమ బెంగాల్‌లో గంటకు 185 కిమీ వేగంతో విధ్వంసం సృష్టించింది. మే 2019లో ఫణి తుఫాను గంటకు 205 కి.మీ వేగంతో ఒడిశాను తాకింది. అంతకుముందు, వియారు (2013), రోను (2016), మోరా (2017) మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడ్డాయి. అయితే, ఇవన్నీ ప్రధానంగా బంగ్లాదేశ్‌ను తాకి, ఇక్కడే ప్రభావం చూపించాయి.

మే లోనే తుఫానులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే..?

మే లోనే తుఫానులు ఎందుకు ఏర్పడుతున్నాయంటే..?


మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడేందుకు సానుకూల పరిస్థితులను కల్పిస్తున్నాయి. దీంతో మే నెలలోనే ఎక్కువగా బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడుతున్నాయి. అందుకే 2021 డిసెంబర్‌లో జవాద్ తుఫాను తీరాన్ని చేరుకోవడంలో బలాన్ని కోల్పోయింది. కొద్దిరోజులపాటు తక్కువ ప్రభావం చూపింది.

English summary
The month of May has been devastating for the past two years. Cyclone Amphan in 2020 and Cyclone Yaas in 2021. Come May 2022, the IMD warns of intensification of yet another depression in the Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X