నా సచ్ఛీలతను, నిజాయితీని ఇంకా నిరూపించుకోవాల్నా: సోనమ్ వాంగ్‌చుక్ సూటి ప్రశ్న

ప్రముఖ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష విమరమించిన అనంతరం అనూహ్య పరిణామాలు తలెత్తాయి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న డీల్ దీనికి కారణమనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తో జరిపిన చర్చల అనంతరం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన నిమ్మరసం తాగి దీక్షను విరమించుకోవడం.. పలు అనుమానాలకు తావిచ్చింది.

వీటిపై వాంగ్‌చుక్ తీవ్రంగా స్పందించారు. తనపై వస్తోన్న విమర్శల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆసుపత్రి నుంచే ఓ వీడియో విడుదల చేశారు. లడఖ్ ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణే శ్వాసగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 26 రోజుల పాటు కఠిన దీక్ష చేసిన తర్వాత కూడా తన నిజాయితీని నిరూపించుకోవాలా సూటిగా ప్రశ్నించారు. పారదర్శకంగా సాగిన లడఖ్ భవిష్యత్ పోరాటాన్ని కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు.

After 26 Days of Hunger Strike Sonam Wangchuk Slams Deal with Centre Claims I Need Prove Sincerity

కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే దీక్ష విరమించాననడంలో అర్థం లేదని తేల్చి చెప్పారు. సమాజ శ్రేయస్సు, లఢక్ ప్రజల హక్కుల కోసం ప్రాణాలకు తెగించి తాను చేసిన ఈ సుదీర్ఘ పోరాటాన్ని కొందరు రాజీ పడటంగా అభివర్ణించడం తనను కలచివేస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణంలో సైతం 26 రోజుల పాటు సాగిన నిరాహార దీక్షను తక్కువ చేయడం సరికాదని, దీని తర్వాత కూడా తాను ఇంకా నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.

జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన వారితో పాటు పార్లమెంట్ మార్చ్ కు సిద్ధమైన ఉద్యమకారులపై ఎలాంటి చట్టపరమైన లేదా పోలీసు చర్యలు తీసుకోబోదని కేంద్రం లిఖితపూరకంగా హామీ ఇచ్చిందని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికే తాము ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికీ కేంద్ర మంత్రులు అంగీకరించారని పేర్కొన్నారు.

ఈ తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌పై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా స్పందించారు. 26 రోజుల పాటు ఆహారం తీసుకోకపోవడం వల్ల వాంగ్‌చుక్ శరీరం బలహీనపడిందని, దాదాపు 11 కిలోల బరువు తగ్గారని చెప్పారు. కండరాల క్షీణత బారిన పడ్డారని వివరించారు. సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి సమాజ హితం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే నాయకులను అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+