వైసీపీ ఓటమి తర్వాత ఐ ప్యాక్ కొత్త ఒప్పందం అక్కడే-వచ్చే ఏడాదే ఎన్నికలు..!
ఏపీలో వైసీపీ కోసం కొన్నేళ్లుగా తీవ్రంగా వ్యూహాలు రచించి గత ఎన్నికల్లో ఆ పార్టీని ముంచేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మాజీ సంస్థ ఐప్యాక్ ఇప్పుడు మరో రాష్ట్రంలో ఎన్నికలకు పనిచేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తాను పనిచేయబోయే పార్టీ, రాష్ట్రం, ఎన్నికలు, ఇతర వివరాలను ఐప్యాక్ పంచుకుంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ఆ రాష్ట్రంలో తమ టీమ్స్ ఎంట్రీ ఇచ్చినట్లు కూడా తెలిపింది.
ఐదేళ్ల క్రితం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం కోసం పనిచేసి సక్సెస్ అయిన ఐప్యాక్ ఇప్పుడు మరోసారి అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి అదే ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసేందుకు అరవింద్ కేజ్రివాల్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపు కోసం వ్యూహరచన చేయబోతున్నట్లు అధికారికంగా ఐప్యాక్ ప్రకటించింది. ఇందుకోసం ఢిల్లీలో టీమ్ లను రంగంలోకి దింపినట్లు తెలిపింది.

ఆప్ కోసం డిజిటల్ టీమ్స్ తో పాటు క్షేత్రస్దాయిలో పనిచేసే టీమ్స్ ను కూడా ఐప్యాక్ రంగంలోకి దింపుతోంది. ఢిల్లీ ఎన్నికల కోసం 70-80 రోజుల పాటు మెరుపు ప్రచారం చేసేలా క్షేత్రస్దాయిలో ఓ 40-50 మందితో కూడిన బృందాన్ని దింపుతున్నట్లు ఐప్యాక్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 2020లో ఢిల్లీ ఎన్నికల్లో ఐప్యాక్ సాయం తీసుకున్న ఆప్ .. మొత్తం 70 సీట్లకు గానూ ఏకంగా 62 సీట్లను గెల్చుకుని కేజ్రివాల్ నేతృత్వంలోని హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఈసారి కూడా ఐప్యాక్ పై ఢిల్లీలో భారీ అంచనాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications